Village: ఆచారాలు, సాంప్రదాయాల విషయంలో భారతదేశం ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. వందల ఏళ్లు గడిచినా.. తాతల కాలం నాటి ఆచారాలు పాటించే వారు ఇప్పటికీ లేకపోలేదు. కేవలం ఇది ఒకరిద్దరికి మాత్రమే పరిమితం కాలేదు. కొన్ని ఊర్లకు ఊర్లు సైతం పూర్వం నుంచి వస్తున్న ఆచార, సాంప్రదాయాల్ని పాటిస్తున్నాయి. ఆ ఆచార, సాంప్రదాయాలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షిస్తున్నాయి కూడా. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తమిళనాడులోని ఓ గ్రామం. ఆ గ్రామంలో పాదరక్షలు వేసుకుని నడవటం నేరం. అలా కాదని ఎవరైనా పాదరక్షలు వేసుకుని తిరిగితే కఠిన శిక్షలు విధిస్తారు. ఆ గ్రామం ఎందుకలా చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.. తమిళనాడులోని వెల్లగవి అనే ఊర్లో చెప్పులు కానీ, బూట్లు కానీ, వేసుకుని నడవటం నేరం. వంద కుటుంబాలు ఉన్న ఈ ఊర్లో ఎవ్వరూ పాదరక్షలు వేసుకుని నడవరు. అలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నడిస్తే శిక్ష తప్పదు. ఈ ఊరికి సరైన రోడ్డు సదుపాయం లేదు. కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాలి. నడక ఎంత కష్టంగా ఉన్నా.. పాద రక్షలు ధరించి నడవటం ఇక్కడ నేరం. ఊర్లో 25కిపైగా గుళ్లు ఉన్నాయి. అందుకే ఆ ఊరిని దేవుడి నిలయంగా ప్రజలు భావిస్తారు. చెప్పులు ధరించి నడిస్తే దేవుడికి కోపం వస్తుందని నమ్ముతారు. ఊరి మొదట్లో ఓ పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు ఉన్న చోటునుంచి చెప్పులు వేసుకుని ఊర్లోకి వెళ్లకూడదు. రాత్రి ఏడు గంటలు అవ్వగానే అందరూ నిద్రపోతారు. రాత్రి ఏడు తర్వాత ఎవ్వరూ గట్టిగా మాట్లాడుకోకూడదు.. పాటలు వినకూడదు. ఇక, ఈ ఊరి మొత్తానికి కలిపి ఒకే ఒక్క టీ షాపు ఉంది. నిత్యవసరాల కోసం దగ్గరలోని టౌన్‌కు వెళతారు. ఎన్ని ఆంక్షలు ఉన్నా ముసలి వాళ్ల విషయంలో ఈ ఆంక్షల్ని కొద్దిగా సడలించారు. ఎండాకాలంలో.. అదీ మిట్ట మధ్యాహ్నం ముసలి వాళ్లు చెప్పులువేసుకుని నడవచ్చు. వారిని ఏమీ అనరు. మరి, ఈ ఊరిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Nellore: బ్రేకింగ్ : నెల్లూరు క్షుద్ర పూజల ఘటన.. చిన్నారి పునర్విక మృతి