రఘురామ కృష్ణరాజుకి బెయిల్! కానీ.., గెలిచింది మాత్రం జగనేనా!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసు కీలక మలుపు తీసుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు సుప్రీం కోర్టు లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యింది. కస్టడీలో చిత్రహింసలు నిజమేనని కోర్టు భావించింది. కానీ.., ఈ బెయిల్ విషయంలో సుప్రీం కొన్ని షరతులను విధించింది. విచారణకు సహకరించాలని, కేసు విచారణ పూర్తి అయ్యే వరకు మీడియా ముందుకి గాని.., సోషల్ మీడియా ముందుకి గాని వచ్చి మాట్లాడకూడదు అని.., ఏపీ సీఐడీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకి హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇక రఘురామ కృష్ణరాజుకి బెయిల్ రావడంతో ఏపీ సీఐడీ పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఏపీ పోలీసుల తరుపున వాదనలతో కోర్టు ఏ దశలోనూ ఏకీభవించలేదు. బెయిల్ రద్దు చేయొద్దని ఏపీ పోలీసుల తరుపున సీనియర్ న్యాయవాధి దావె వాధించినా.. ఆ వాదనను సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. దీనితో.., జగన్ పై రఘురామ కృష్ణరాజు విజయం సాధించారంటూ కొన్ని వర్గాల నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Cm jagan

నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరికైనా మేలు జరిగిందా అంటే అది జగన్ కే అని చెప్పుకోవాలి. ఎప్పటి నుండో సొంత పార్టీకి రెబల్ గా మారిన రఘురామ నోటికి ఇప్పుడు జగన్ తాళం వేయించగలిగాడు. సుప్రీం కోర్టు పెట్టిన కండీషన్స్ కారణంగా ఆయనకి ఇక మౌనమే శరణ్యం. సో.. వైసీపీ కి ఇక రెబల్ దెబ్బ తగ్గినట్టే. ఇక ఇదే సమయంలో జగన్ తన సొంత మనుషులను శాంత పరచగలిగారు. రఘురామ ఇది వరకు రోజు ప్రభుత్వంపై దారుణమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ విషయంలో జగన్ మౌనంగా ఉండటం.. సొంత పార్టీ వారికే నచ్చలేదు. కానీ.., ఈ అరెస్ట్ పరిణామాలతో జగన్ సొంత మనుషులను శాంత పరిచినట్టు అయ్యింది. ఇక అన్నిటికీ మించి రఘురామ అరెస్ట్ తో జగన్ తన ప్రత్యర్థులకు ఎలాంటి సంకేతాలు ఇచ్చాడన్నది ప్రధానమైన పాయింట్. సొంత పార్టీలో వ్యక్తులు గాని.., ప్రతిపక్షాలు గాని తనని ఇరకాటంలో పెట్టాలని చూస్తే.. తాను తగ్గే రకం కాదని జగన్ మరోసారి చెప్పకనే చెప్పాడు. దీని వల్ల రానున్న కాలంలో కూడా కొత్తగా పార్టీలో అసమ్మతి గొంతులు వినిపించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక రఘురామని టీడీపీ ఓన్ చేసుకునేలా చేయడంలో జగన్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒకవేళ రఘురామ కృష్ణరాజు రానున్న కాలంలో ఏవైనా విమర్శలు చేసినా.., అవి సొంత పార్టీ నాయకుడు చేసిన కామెంట్స్ గా కాకుండా, టీడీపీ వారి విమర్శలుగా జనాలకి అర్ధం అవుతుంది. ఇలా రఘురామ కేసులో జగన్ కి అన్నీ కలిసొచ్చే అంశాలే జరిగాయి. కాబట్టి ఈ కేసులో బెయిల్ రఘురామకి వచ్చినా.., గెలుపు మాత్రం జగన్ కే దక్కింది అని చెపుకోవచ్చు.