ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి నలుగురు ఏపీ సీఐడీ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు బయటకు రాకపోవడంతో అధికారులు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు వచ్చారు. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లు ఇవ్వనున్న అధికారులు. అయితే ఏ కేసుకు సంబంధించిన నోటీసులు అనే విషయంపై స్పష్టత లేదు. బెయిల్ తీసుకుని ఢిల్లీలోనే ఉంటున్న రఘురామ సంక్రాంతి సందర్భంగా […]
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసు కీలక మలుపు తీసుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు సుప్రీం కోర్టు లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యింది. కస్టడీలో చిత్రహింసలు నిజమేనని కోర్టు భావించింది. కానీ.., ఈ బెయిల్ విషయంలో సుప్రీం కొన్ని షరతులను విధించింది. విచారణకు సహకరించాలని, కేసు విచారణ పూర్తి అయ్యే వరకు మీడియా ముందుకి గాని.., సోషల్ మీడియా ముందుకి గాని వచ్చి […]
న్యూ ఢిల్లీ- వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ రఘురామ కృష్ణ రాజు వైద్య పరీక్షల నివేదికతో పాటు, బెయిల్ పిటీషన్ పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదికను చదివి వినిపించారు. ఆయన కాలిపై గాయాలతో పాటు, కాలి వేలు ఎముక విరిగినట్లు నివేదికలో పేర్కొన్నారని […]
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ని న్యాయమూర్తి చదివి వినిపించారు. రఘురామరాజు కాలిపై గాయాలు ఉన్న మాట వాస్తవం. ఆయన ఎడమ కాలి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యి ఉంది. అలాగే.. కాలిపై ఉన్న అన్నీ ఎంకచ్ఛలు కూడా గాయాలు కాదు. రఘురా కృష్ణరాజు చాలా సంవత్సరాలుగా ఎడిమా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కరోజు బడ్జెట్ సెషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఒక్కరోజులోనే గవర్నర్ ప్రసంగం, కావాల్సిన తీర్మానాలు అన్నీ అయిపోయాయి. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం వైసీపీ ఎమ్మెల్యే జోగీ రమేశ్ కి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన పూర్తిగా ట్రాక్ తప్పి రఘురామ కృష్ణరాజుపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ లేని వ్యక్తుల గురించి ప్రస్తావించకూడదన్న ఆలోచన కూడా లేకుండా జోగీ రమేశ్ రఘురామపై దారుణమైన పదజాలం వాడారు. మా సీఎం జగన్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుతాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నిన కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు క్లైమ్యాక్స్ వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజుకో మలుపు తీసుకుంటూ వచ్చిన ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ అధికారులు కాస్త దుండుగుతనం ప్రదర్శించిన మాట వాస్తవం. కానీ.., సీఐడీ పోలీసులు తనని కొట్టారంటూ రఘురామరాజు ఆరోపించడంతో ఈ కేసు ఓ కొలిక్కి రాకుండా ఆ సంఘటన చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే హైకోర్టు […]
న్యూ ఢిల్లీ- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం ముగ్గురు వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రఘురామ కృష్ణరాజుకు జరిపే వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో […]
ఏ ముహూర్తాన ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేశారో తెలియదు గాని.., అప్పటి నుండి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఎలాంటి నోటీసులు, వారెంట్ చూపించకుండా.., స్పీకర్ అనుమతి లేకుండా, ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారంటూ.. రఘురామ వర్గీయులు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించారు. కానీ.., హైకోర్టు ఈ విషయంలో ఎక్కడా ప్రభుత్వవాన్ని ప్రశ్నించలేదు. ఇక రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటీషన్ ని కూడా హై కోర్ట్ కొట్టేసిన విషయం […]
ఆంధ్రప్రదేశ్ లో రఘురామ కృష్ణరాజు అరెస్ట్ ప్రకంపనలు రేపుతోంది. నర్సాపురం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా నిలిచిన రఘురామ ఎన్నడూ ఆ పార్టీ పట్ల విధేయత చాటుకోలేదు. పార్టీకి పక్కలో బల్లెంల వ్యవహరిస్తూనే వచ్చారు. కానీ.., ఇన్ని రోజులు ఈ విషయంలో మౌనం వహిస్తూ వచ్చిన జగన్ సర్కార్ మొదటిసారి ఆయనపై సిఐడి అస్త్రాన్ని సంధించింది. బెయిల్ రావడం కూడా చాలా కష్టమైన సెక్షన్స్ కింద ఆయన్ని అరెస్ట్ చేసి తమ పంతాన్ని నెగ్గించుకుంది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం […]
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను తప్పుబడుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం జగన్ రెడ్డి […]