ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుతాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నిన కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు క్లైమ్యాక్స్ వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజుకో మలుపు తీసుకుంటూ వచ్చిన ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ అధికారులు కాస్త దుండుగుతనం ప్రదర్శించిన మాట వాస్తవం. కానీ.., సీఐడీ పోలీసులు తనని కొట్టారంటూ రఘురామరాజు ఆరోపించడంతో ఈ కేసు ఓ కొలిక్కి రాకుండా ఆ సంఘటన చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే హైకోర్టు నియమించిన మెడికల్ బోర్డు రఘురామ ఒంటిపై ఉన్నవి గాయాలు కావని రిపోర్ట్ ఇచ్చింది. కానీ.., ఎంపీ పిటీషన్ తో సుప్రీం కోర్టు ఆర్మీ హాస్పిటల్ నుండి కూడా మెడికల్ రిపోర్ట్స్ కోరింది. ఆ రిపోర్ట్స్ ఇప్పటికే సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్టుకి చేరాయి. కానీ.., అందుతున్న సమాచారం మేరకు ఇక్కడ కూడా రఘురామరాజుకి చేదు అనుభవం ఎదురు కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎంపీ రఘురామకృష్ణరాజు తనను పోలీసులు కొట్టినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టమవుతోంది. బెయిల్ రాకపోవడం, కుట్రదారులను నిగ్గు తేల్చేందుకు క్షుణ్నంగా విచారణ జరుగుతుండటంతోనే.. ఆయన ఈ ఎత్తుగడ వేశారా అన్న అనుమానాలు ఎదురవుతున్నాయి.
రఘురా కృష్ణరాజు చాలా సంవత్సరాలుగా ఎడిమా అనే వ్యాధితో బాధపడుతున్నారట. దీని కారణంగానే ఆయన రెండు పాదాల్లో నీరు చేరడంతో కాళ్ళు వాచినట్లు ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు. అందువల్లే ఆయన అరికాళ్లు రంగు మారాయని పేర్కొన్నారు. ఇంతే కాకుండా ఆయనకు ముందు నుంచీ ఉన్న నరాల సంబంధిత సమస్యతో కాలి పిక్కల వద్ద నరాల పనితీరులో ఇబ్బందులు తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. అదే విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, కిడ్నీ వ్యాధి నిపుణులు ఆయన్ను పరిశీలించారని బోర్డు నివేదికలో స్పష్టం చేసింది. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని కూడా తేల్చి చెప్పింది. ఇప్పుడు ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ కూడా ఇదే విధంగా ఉండబోతుంది అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రఘురామరాజు ఎడిమాతో బాధపడుతున్న విషయం టీడీపీ, వైసీపీలో చాలా మంది నేతలకి ముందు నుండి తెలుసు. ఆ పాదాలపై మచ్చలు ఎప్పటి నుండో అలానే ఉన్నాయి కదా? ఈయన ఎందుకు ఇప్పుడు ఈ డ్రామాలు అడుతనరంటూ సహచర నేతలు సైతం చర్చించుకుంటున్నారట. ఏదేమైనా… ఆర్మీ రిపోర్ట్ లో గనుక అవి దెబ్బలు కావని తేలితే ఇక రఘురామ కృష్ణరాజు బయటకి రావడం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం ఆవుతోన్నాయి. చూడాలి మరి నర్సాపురం ఎంపీ భవితర్యం ఏమిటో?