ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి నలుగురు ఏపీ సీఐడీ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు బయటకు రాకపోవడంతో అధికారులు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు వచ్చారు. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లు ఇవ్వనున్న అధికారులు. అయితే ఏ కేసుకు సంబంధించిన నోటీసులు అనే విషయంపై స్పష్టత లేదు. బెయిల్ తీసుకుని ఢిల్లీలోనే ఉంటున్న రఘురామ సంక్రాంతి సందర్భంగా సొంత నియోజకవర్గాని వెళ్లేందుకు హైదరాబాద్ చేరుకున్నారు.