ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కవిత నేడు విచారణకు హాజరవుతుండగా.. వివేకా కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించింది. ఇక తాజాగా సీఐడీ రంగంలోకి దిగింది. ఆ వివరాలు..
అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ రెండవ కుమార్తె శరణి ఇంట్లో ఏపీ సీఐడి అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఈ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హైదరాబాద్ లోని ఆమె నివాసంలో దాడులు చేపట్టారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామునే సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఓ గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు.. నకిలీ డాక్యుమెంట్లుగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 464, 467, 471, 474, 34 […]
Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై ఏపీ సీఐడీ వివరణ ఇచ్చింది. టీడీపీ విడుదల చేసిన రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ తెలిపారు. గురువారం ఆయన మీడియా మాట్లాడుతూ.. ‘‘ ప్రైవేట్ ల్యాబ్స్ ఇచ్చే నివేదికలకు విలువ ఉండదు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికనే ప్రామాణికం. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. ఆ వీడియోను […]
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్థరాత్రి పూట అరెస్ట్ చేయడం ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. అశోక్ బాబు అరెస్ట్ తో అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైడ్రామా నడుస్తోంది. అశోక్ బాబు ఓ పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో విజయవాడ పటమటలంకలో సీఐడీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో అశోక్ బాబును అరెస్ట్ చేసినట్లు.. సీఐడీ పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. అశోక్ […]
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి నలుగురు ఏపీ సీఐడీ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు బయటకు రాకపోవడంతో అధికారులు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు వచ్చారు. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లు ఇవ్వనున్న అధికారులు. అయితే ఏ కేసుకు సంబంధించిన నోటీసులు అనే విషయంపై స్పష్టత లేదు. బెయిల్ తీసుకుని ఢిల్లీలోనే ఉంటున్న రఘురామ సంక్రాంతి సందర్భంగా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుతాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నిన కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసు క్లైమ్యాక్స్ వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజుకో మలుపు తీసుకుంటూ వచ్చిన ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ అధికారులు కాస్త దుండుగుతనం ప్రదర్శించిన మాట వాస్తవం. కానీ.., సీఐడీ పోలీసులు తనని కొట్టారంటూ రఘురామరాజు ఆరోపించడంతో ఈ కేసు ఓ కొలిక్కి రాకుండా ఆ సంఘటన చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే హైకోర్టు […]
కరోనా కారణంగా దేశంలోని అన్నీ రాష్ట్రాలలో పొలిటికల్ హీట్ తగ్గిపోయింది. రాజకీయ నాయకులు సైతం బయటకి రావడనికి బయపడే పరిస్థితిలు నెలకొన్నాయి. కానీ.., ఇంత జరుగుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదో ఒక వార్త ట్రెండింగ్ లో ఉంటూనే వస్తోంది. ఒకవైపు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఇలాంటి సమయంలోనే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై […]