కరోనా కారణంగా దేశంలోని అన్నీ రాష్ట్రాలలో పొలిటికల్ హీట్ తగ్గిపోయింది. రాజకీయ నాయకులు సైతం బయటకి రావడనికి బయపడే పరిస్థితిలు నెలకొన్నాయి. కానీ.., ఇంత జరుగుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదో ఒక వార్త ట్రెండింగ్ లో ఉంటూనే వస్తోంది. ఒకవైపు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఇలాంటి సమయంలోనే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సిబిఐ హై కోర్టు సంచలన కామెంట్స్ చేయడం విశేషం. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై బయటకి వచ్చిన జగన్.. తరువాత కాలంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో.. ఆ బెయిల్ అలా కొనసాగుతూనే వచ్చింది. ఇక ఆ కేసు కూడా విచారణకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఆ విచారణకి జగన్ అటెండ్ అయినా సందర్భాలు ఇంకా తక్కువ. కానీ.., వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలంటే సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సిబిఐ కోర్ట్ ఈ పిటీషన్ ని విచారణకు స్వీకరించింది. ఇదే సమయంలో ఇటు సిబిఐ అధికారులను, అటు జగన్ తరుపు న్యాయవాదులను ను కౌంటర్లు దాఖలు చేసుకోవాల్సిందిగా కోరింది. కానీ.., అధికారులు గానీ.., జగన్ తరుపు లాయర్లు గాని ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. దీనితో ఇప్పటికే ఈ విచారణ 2సార్లు వాయిదా పడింది. ఇక ఈరోజు కూడా కౌంటర్స్ వేయకపోవడంతో సిబిఐ కోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్ కి, సీబీఐకి చివరి అవకాశం ఇచ్చి.., విచారణ ఈ నెల 26కి వాయిదా వేసింది. రాఘురామరాజు వేసిన ఈ కౌంటర్ విషయంలో సిఐడి కోర్టు ఇంత సీరియస్ గా స్పందించడంతో విచారణ ప్రారంభమైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న చర్చలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ కావడం వల్ల దీని వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎంపీ రఘురామను అలా అరెస్ట్ చేశారో లేదో టీడీపీ బీజేపీ జనసేన స్పందించిన తీరును వైసీపీ నాయకులు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎంపీ రఘురామ వెనుక ఉంటూ ఆయన్ని ముందుకు పెట్టి కథ నడిపిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా జగన్ బెయిల్ రద్దు విచారణ మాత్రం వైసీపీ నాయకుల్లో టెన్షన్ పుట్టేలా చేస్తోంది. మరి రానున్న కాలంలో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి.