ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది.
ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అక్రమ వ్యవహారాలు జరిగాయంటూ మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి కొన్ని రోజుల క్రితం ఏపీ సీఐడీ అధికారులు జారీ చేసిన సంగతి తెలిసిందే. చిట్ ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రామోజీరావును ఏ1గా, శైలజా కిరణ్ ను ఏ2గా చేర్చి.. చిట్ ఫండ్స్ బ్రాంచ్ ల మేనేజర్లపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న శైలజా కిరణ్ నివాసంలో సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు రామోజీరావుని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో గత వారం రామోజీరావు, శైలజ కిరణ్ లకు సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నోటీసులు జారీ చేశారు.
మోసం చేయడం, డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్ లోకి మళ్లించడం, క్యాపిటల్ మార్కెట్ల నష్టాలూ, చిట్ ఫండ్ బిజినెస్ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు. విచారణకు సహకరించేందుకు మార్చి 29 లేదా 31 లేదా ఏప్రిల్ 3 లేదా 6వ తేదీల్లో రామోజీరావు, శైలజ కిరణ్ లు తమ న్విఅసంలో గానీ కార్యాలయంలో గానీ అందుబాటులో ఉండాలని సీఐడీ కోరింది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఏప్రిల్ 3న) రామోజీరావును, శైలజ కిరణ్ లను విడివిడిగా విచారిస్తున్నారు. అయితే రామోజీరావు ఆరోగ్యం ప్రస్తుతం సహకరించడం లేదని.. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు https://t.co/2f5VmlkZbg pic.twitter.com/FLYAEBxIB0
— Telugu Scribe (@TeluguScribe) April 3, 2023