ఎలాంటి వారైనా తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు అంటారు. ఇటీవల కొంతమంది సెలబ్రెటీలు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయ్యే ఇలా చేయకుంటే బాగుండునే అనుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. అప్పుడప్పుడు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, క్రీడా రంగానికి చెందిన వారు చేసే చిన్న పొరపాటు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఏదైనా వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్లినా.. ఎక్కడైనా నోరు జారినా సోషల్ మీడియాలో పెద్ద రచ్చే అవుతుంది. ప్రముఖ కమెడియన్, మిమిక్రి ఆర్టిస్ట్ శ్యామ్ రంగీలకు జైపూర్ అటవీ శాఖ వారు నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, హాస్య నటుడు శ్యామ్ రంగీలా జైపూర్ లోని ఝలానా చిరుతపులి రిజర్వ్ లో నీల్‌గాయ్‌కు కు ఆహారం తినిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నీల్‌గాయ్‌కు కి ఆహారం తినిపిస్తున్న సమయంలో ఇటీవల ప్రధాని మోదీ అటవీ పర్యటన సందర్భంగా ధరించిన దుస్తులను పోలిన వేషధారణలో శ్యామ్ రంగీలా కనిపించాడు.. ఈ ఫోటోలు, వీడియోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఇటీవల జంగిల్ సఫారీ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ మునుపెన్నడూ కనిపించని విధంగా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ గెటప్ లో మోదీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.
ఇక కమెడియన్ శ్యామ్ రంగీలా సైతం అచ్చం ప్రధాని మోదీ గెటప్ లో కనిపించేలా టోపీ, హాప్ స్లీవ్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. అయితే జైపూర్ లో ఝలానా లో జంగిల్ సఫారీలో నీల్ గాయ్కు ఆహారం తినిపించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు లెక్క. ఈ క్రమంలో జైపూర్ అటవీశాఖ వారు కమెడియన్ శ్యామ్ రంగీలాకు నోటీసులు పంపించారు. ఏప్రిల్ 13 న శ్యామ్ రంగీలా అనే యూట్యూబ్ ఛానెల్ లో ఝలానా చిరుత పులి రిజర్వ వీడియోలను అప్ లోడ్ చేసినట్లు అటవీ శాఖ అధికారి జనేశ్వర్ చౌదరి తెలిపారు.
వన్యప్రాణులకు ఆహారం తినిపించడం అటవీ చట్టం 1953, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం నిబంధలనలు ఉల్లంఘించినట్లు లెక్క. అడవిలో పెరిగే జంతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవి ఏవైనా వ్యాధుల భారిన పడితే ఇతర జంతువులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందిన అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఝలానా అటవీ ప్రాంతంలో జంతువులకు ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు అని బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు అధికారుల. అంతేకాదు శ్యామ్ రంగీలా తాను చేసింది ఏదో గొప్ప పని అయినట్లు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇతరులను నేరపూరిత చర్యలకు ప్రేరేపించడమే అవుతుందని అటవీ శాఖ అధికారి తెలిపారు.