ఈ రోజు స్వల్పంగా పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధర


పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు పెరిగింది.

10గ్రా 24 క్యారెట్ 150 రూపాయలు పెరిగింది..

22 క్యారెట్ 10గ్రా బంగారం 44,650.

24 క్యారెట్ 10గ్రా బంగారం 48,710.

1కిలో వెండి 75, 300

బిజినెస్ డెస్క్- ఈరోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 15 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగి 44 వేల 650 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగి 48 వేల 710 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర 700 రూపాయలు తగ్గింది. దీంతో మార్కెట్లో వెండి కిలొ 75 వేల 300 పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 650 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 710 రూపాయలు పెరిగింది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.