బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మరోసారి బంగారం ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు శుభవార్త. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర మరోసారి పతనమైంది. ఆగస్టు 18న 1897డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్ ఇవాళ 1889 డాలర్లకు పతనమైంది. ఈ మూడు రోజులు అంతర్జాతీయ మార్కెట్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. అయితే నిన్న అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా స్పాట్ గోల్డ్ రేటు పెరగడంతో ఇవాళ దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,100 ఉండగా ఇవాళ రూ. 50 పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,150 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 59,020 ఉండగా ఇవాళ రూ. 50 పెరిగింది.
దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ. 59,070 వద్ద కొనసాగుతుంది. అయితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. నిన్న కిలో వెండి రూ. 76,500 ఉండగా ఇవాళ కూడా ఇదే ధర కొనసాగుతుంది. అయితే ఈ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రతికూల పరిస్థితుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1889.52 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. స్పాట్ వెండి 22.75 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఈ కారణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది.