బంగారం కొనాలనుకునేవారికి అలర్ట్. ప్రస్తుతం హైదరాబాద్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు శుభవార్త. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర భారీగా పతనమైంది. ఎప్పుడూ లేని విధంగా కనిష్ట స్థాయికి పడిపోయింది. మూడు రోజుల క్రితం వరకూ 1920 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్ ఇప్పుడు భారీగా పతనమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1892.36 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్న గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1892.81 డాలర్ల వద్ద ఉండగా ఇవాళ స్వల్పంగా తగ్గింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 54,100 వద్ద ఉండగా ఇవాళ స్థిరంగా ఉంది.
ఇక 24 క్యారెట్ల బంగారం ఐతే నిన్న రూ. 59,020 ఉండగా ఇవాళ కూడా ఇదే ధర కొనసాగుతుంది. ఇక వెండి విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 22.82 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్న 22.49 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ వెండి ఇవాళ మాత్రం పెరిగింది. దీంతో దేశీయంగా వెండి ధర మరోసారి పెరిగింది. నిన్న హైదరాబాద్ లో కిలో వెండి రూ. 75,700 ఉండగా ఇవాళ కిలో మీద రూ. 1000 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 76,700 వద్ద కొనసాగుతుంది. సానుకూలంగా సాగుతున్నందుకు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.