కొవిడ్ బాధితులకు 10 నెలల వరకూ కొవిడ్‌ నుంచి రక్షణ!..

కరోనావైరస్ బారిన పడే ముప్పు వృద్ధులకు ఎక్కువగా ఉంటుందని ఇప్పటి వరకు కరోనావైరస్ పై జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. అలా అని ఈ వైరస్ యుక్త వయస్కులు, చిన్న పిల్లలకు సోకదని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే ఇదే సమయంలో ఒకసారి కొవిడ్‌-19కు గురైనవారు మళ్లీ మహమ్మారి బారిన పడే ముప్పు చాలా తక్కువని తాజా అధ్యయనంలో నిరూపితమైంది. ఇలాంటి వారికి సహజ రోగనిరోధకత పది నెలల పాటు ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని తేలింది! యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధన వివరాలను ‘ద లాన్సెట్‌ హెల్దీ లాంగెవిటీ’ జర్నల్‌ అందించింది. ఇంగ్లండ్‌లోని కేర్‌ హోమ్‌లో నివాసం ఉంటున్నవారు, వైద్య సిబ్బంది కలిపి మొత్తం 2,111 మందికి గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ పరిశోధకులు  దఫదఫాలుగా కొవిడ్‌ యంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించారు.  682 మంది, సిబ్బందిలో 1,429 మంది అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 634 మంది ఇంతకుముందే కొవిడ్‌కు గురయ్యారు.

shutterstock 1642065145

అధ్యయన సమయంలో నివాసుల్లో నలుగురు, సిబ్బందిలో 10 మంది రెండోసారి కొవిడ్‌ బారిన పడ్డారు. ఇంతకుముందు కొవిడ్‌కు గురికాని 1,477 మందిలో 93 మంది నివాసులకు, 111 మంది సిబ్బందికి మొదటిసారి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. మిగతా వారితో పోల్చితే ఒకసారి కొవిడ్‌ వచ్చి, ఇళ్లలో ఉంటున్నవారికి రీ-ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 85%, వైద్య సిబ్బందికి 60% తక్కువగా ఉంటోంది. సుమారు 10 నెలల వరకూ కొవిడ్‌ నుంచి వీరికి రక్షణ లభిస్తోంది’’ అని యూసీఎల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఇన్‌ఫార్మేటిక్స్‌ పరిశోధనకర్త మరియా రుతికోవ్‌ విశ్లేషించారు.