కరోనా వైరస్‌కు సంబంధించి పలు విషయాలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, వాట్సాప్ తో పాటు సోషల్ మీడియాలోను వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇందులో కొన్ని నిజాలు కాగా చాలా అంశాలు నిరాధారమైనవే. అయితే తాజాగా కోవిడ్ వైరస్ గురించి అట్లాంటిక్ నివేదిక పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
మూడేళ్ల క్రితం కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోన కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కోవిడ్ మహమ్మారికి చైనానే కారణమని, అక్కడి నుంచి ఈ వైరస్ వచ్చిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అలానే ఈ కోవిడ్ మహమ్మారి మూలాల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా అట్లాంటిక్ నివేదిక పలు ఆసక్తిరకమైన విషయాలను వెల్లడిచింది. కోవిడ్ మూలం చైనా లోని వుహాన్ మార్కెట్ నుండి రక్కూన్ కుక్కల ద్వారా ప్రారంభమై ఉండవచ్చని ఇంటర్నేషనల్ వైరస్ నిపుణుల బృందం పేర్కొంది.
ఇక వైద్య నిపుణులు పరిశోధనల ప్రకారం.. ఈ వైరస్ సోకిన జంతువులను వన్యప్రాణులతో పాటు అక్రమంగా రవాణా చేశారు. తద్వారా ఈ వైరస్ వ్యాప్తి జరిగింది. జనవరి 2020లో హువానాన్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్ లోపల, అలానే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జన్యు డేటాను సేకరించడం జరిగింది. చైనా అధికారులు మార్కెట్‌ను మూసివేసిన కొద్దిసేపటికే కొత్త వైరస్ వ్యాప్తికి సంబంధించిన అనుమానాల వ్యక్తమయ్యాయి. మార్కెట్ నుండి జంతువులను తొలగించినప్పటికీ, నిపుణులు గోడలు, భవనాల, మెటల్ బోనులు, బండ్ల నుండి కొన్ని కణాలను సేకరించారు. పరీక్షల అనంతరం శాంపిల్స్‌లో కరోనా పాజిటివ్ అని తేలింది.
విశ్లేషణలో పాల్గొన్న ముగ్గురు శాస్త్రవేత్తలు జన్యు పదార్ధం జంతువులకు చెందినదని గుర్తించారు. అందులోనూు రక్కూన్ కుక్కతో ఈ జన్యుపదార్థం సరిపోయినట్లు అట్లాంటిక్ నివేదించింది. అయితే వైరస్ అనేది జంతువు నుండి రక్కూన్ కుక్క కూడా సోకినట్లు నిరూపించలేదు. ఒక రక్కూన్ కుక్కకు వైరస్ ఉన్నప్పటికీ, అదే మానవులకు బహిర్గతం చేసిందా ? అనేది స్పష్టంగా లేదు. వైరస్ మరొక జంతువు నుండి ప్రజలకు బదిలీ చేయబడి ఉండవచ్చు లేదా వైరస్ సోకిన ఎవరైనా రక్కూన్ కుక్కకు వైరస్ వ్యాప్తి చేసి ఉండవచ్చుని నివేదిక పేర్కొంది.