కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు..మొక్కులను తీర్చే భగవంతుడు.శ్రీనివాసుని పావన నిలయం తిరుమల. ప్రపంచం లో అత్యధికంగా భక్తులు దర్శించే క్షేత్రంగా నిలిచింది .ఈ క్షేత్రం పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో నూతన విధానాలను అనుసరిస్తుంది.అందులో భాగంగా త్వరలో తిరుమలలో డిఆర్‌డిఓ యాంటీ-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ బోర్డు తిరుమలలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి రంగంలోకి దిగింది. ఉగ్ర కుట్రలను టెక్నాలజీతో తిప్పికొట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రెడీ చేస్తోంది.ఇందులో భాగంగా యాంటీ […]
సెకండ్ వేవ్ ఉధృతికి ఏ కరోనా వేరియంట్ కారణం? అనేది తెలుసుకునేందుకు ఇండియన్ సార్స్ కరోనా వైరస్ జీనోమిక్ కన్సార్టియా , నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. ‘డెల్టా’ కరోనా వేరియంట్ సెకండ్‌వేవ్‌లో అత్యంత వేగంగా వ్యాపించి కొవిడ్ కేసులు భారీగా పెరగడానికి దారితీసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. డెల్టా వేరియంట్ అనేది డబుల్ మ్యుటెంట్ ఉపవర్గానికి చెందినది. సెకండ్ వేవ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, […]
కరోనావైరస్ బారిన పడే ముప్పు వృద్ధులకు ఎక్కువగా ఉంటుందని ఇప్పటి వరకు కరోనావైరస్ పై జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. అలా అని ఈ వైరస్ యుక్త వయస్కులు, చిన్న పిల్లలకు సోకదని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే ఇదే సమయంలో ఒకసారి కొవిడ్-19కు గురైనవారు మళ్లీ మహమ్మారి బారిన పడే ముప్పు చాలా తక్కువని తాజా అధ్యయనంలో నిరూపితమైంది. ఇలాంటి వారికి సహజ రోగనిరోధకత పది నెలల పాటు ఇన్‌ఫెక్షన్ నుంచి […]
ఆనందయ్యకు రోజురోజుకూ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ నటుడు జగపతిబాబు ఆయనను ప్రశంసించారు. ప్రముఖ మత గురువు కేఏ పాల్ కూడా ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు. ఆనందయ్య కనిపెట్టిన ఆనందయ్య మందు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ఆనందయ్యతో తాను కొన్ని గంటల క్రితమే మాట్లాడానని, ప్రస్తుతం ఆయన పోలీసుల వలయం ఉన్నారని చెప్పారు. ఈ మేరకు కేఏ పాల్ అమెరికా నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్నాయన్నారు. తన […]
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత రిలీఫ్ ఇస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా టీకాను సింగిల్ డోస్ వేసుకున్నా, వైరస్ తో చనిపోయే ప్రమాదం 80 శాతం వరకూ తగ్గుతుందని ‘పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)’ సంస్థ వెల్లడించింది. అలాగే ఫైజర్ బయో ఎన్ […]
కరోనా రెండో వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఇందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు పాటిస్తున్నారు. పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. […]