గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ప్రజల్లో ఎంత నమ్మకం ఉందన్న అంశంపై మెగా సర్వే నిర్వహించగా ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలను రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విడుదల చేశారు.
ఏప్రిల్ 7వ తేదీన ఏపీ ప్రభుత్వం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన పట్ల ప్రజల్లో ఎంత విశ్వాసం, నమ్మకం ఉన్నాయన్న దాని మీద ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహించారు. తాజాగా ఈ సర్వేకి సంబంధించిన ఫలితాలను రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విడుదల చేశారు. ‘వైఎస్సార్సీపీ జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్స్ సర్వే ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భారత రాజకీయ వ్యవస్థ గతంలో ఎన్నడూ ఇలాంటి మెగా పొలిటికల్ సర్వే జరగలేదని అన్నారు.
ఈ పొలిటికల్ సర్వే ఆసక్తికరంగా ఉండడంతో పాటు ఇతర రాజకీయ పార్టీలు అనుసరించేలా ట్రెండ్ సెట్ చేయనుందని అన్నారు. ఇంత తక్కువ సమయంలో 1.45 కోట్ల మంది ఈ ‘జగనన్నే మా భవిష్యత్తు’ డ్రైవ్ లో పాల్గొన్నారని.. 1.10 కోట్ల మిస్డ్ కాల్స్ వచ్చాయని.. దాదాపు 80 శాతం కుటుంబాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మద్దతుగా నిలిచారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం, సుపరిపాలన మీద ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉన్నాయనడానికి ఈ సర్వేనే నిదర్శనం అని అన్నారు. విజన్ ని గ్రౌండ్ లెవల్ లో రియాలిటీగా మారుస్తూ.. ఈ దేశానికి గొప్ప భవిష్యత్తు కలిగించే ఒక పిల్లర్ గా రాష్ట్రాన్ని మారుస్తున్న జగన్ పట్ల ప్రజలు ఎంత నమ్మకంగా ఉన్నారో కూడా ఈ సర్వే రుజువు చేసిందని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు.