దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రతీ సంవత్సరం కొన్ని వేల మంది చనిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని నిబంధనలు తెచ్చినా గానీ వాహనదారులు వాటిని చెవిన పెట్టడంలేదు. దాంతో ట్రాఫిక్ పోలీసులు కూడా పద్దతి మార్చారు. వాహనదారులు ఎలా చెప్తే వింటారో వారికి అర్థం అయ్యింది. ఈ విధానానికి వారు ఎంచుకున్న ఫ్లాట్ ఫామ్ సోషల్ మీడియా. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాలు, మీమ్స్ ల తో వాహనదారులకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూనే ఉంటారు. ఒక్కో సారి సైబరాబాద్ పోలీసులు మీమ్స్ చూస్తుంటే.. మా ప్రాణాలు కాపాడటం కోసం మీరు ఇంత తాపత్రయ పడతారా? అనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ.. దినేశ్ కార్తీక్ గొంతు పట్టుకున్నాడు. అదీ కాక కోహ్లీ ఓ లుక్ కూడా తెగ వైరల్ అవుతోంది. దాంతో ఈ రెండింటీని ట్రాఫిక్ పోలీసులు మీమ్స్ రూపంలో వాడారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు.. టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ తో ప్రజలల్లో రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పిస్తూంటారు. ఈ క్రమంలోనే పోలీసులు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వోద్దని, అలాగే డ్రైవింగ్ రాని వారికి వాహనాలు కూడా ఇవ్వొద్దని వారు సూచిస్తున్నారు. ఇలా ఇవ్వడం మీ ప్రాణాలకే కాక అవతలి వారి ప్రాణాలకు కూడా ప్రమాదకరం అని వారు రాసుకొచ్చారు. దానికోసం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలను మీమ్స్ రూపంలో వాడుకున్నారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ.. దినేశ్ కార్తీక్ గొంతు పట్టుకున్నాడు. ఈ ఫొటో ని ఆధారంగా చేసుకుని మన ఫ్రెండ్ హెల్మెట్ లేకుండా పట్టుపడితే పోలీసులతో ఇలాగే ఉంటుంది అని రాసుకొచ్చారు. పక్కనే కోహ్లీ దొంగచూపులు చూస్తున్న మరో పిక్ ని జత చేసి.. హెల్మెంట్ లేకుంటేనే అలా చేస్తే.. నేను త్రిబుల్ రైడ్ చేస్తున్నా నన్నేం చేస్తార్రా బాబు అన్నట్లు ఆ చూపుకు అర్ధం వచ్చేలా రాశారు.
అయితే ఈ మ్యాచ్ లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో స్మిత్, మ్యాక్స్ వెల్ ఇద్దరూ కీపర్ క్యాచ్ లకు అవుట్ అయ్యారు. కానీ దినేశ్ కార్తీక్ గట్టిగా అప్పీల్ చేయలేదు. దాంతో రోహిత్ శర్మ డిఆర్ఎస్ తీసుకోగా.. వారిద్దరూ అవుట్ అని తేలింది. దీంతో రోహిత్.. డీకే గొంతు పట్టుకుని గట్టిగా అరవొచ్చు కదా అని సరదాగా అన్నాడు. ఇక కోహ్లీ పిక్ విషయానికి వస్తే.. ఆసిస్ ఓపెనర్ కామెరోన్ గ్రీన్ వరుసగా రెండు బౌండరీలు కొట్టడంతో కోహ్లీ ఈ లుక్ ఇచ్చాడు. దానిని కామెంటేటర్ ఇయాన్ బిషప్ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఇది కచ్చితంగా మీమర్ల కు ఉపయోగపడుతుందని రాసుకొచ్చాడు. అతడు అన్నట్లుగానే ఈ పిక్ మీమ్స్ లల్లో దూసుకెళ్తోంది. పరిస్థితులకు తగ్గట్లుగా మారి వాహనదారులకు ఎల్లవేలలా సహాయం చేయాలని చూసే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Underage driving and driving without skills were not only going to endanger you but also the lives of other commuters.#RoadSafety #ViratKohli𓃵 #RohitSharma pic.twitter.com/TpmT7G7RSQ
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) September 21, 2022
I can see that Virat Kohli look becoming a meme🤣🤣
— Ian Raphael Bishop (@irbishi) September 20, 2022