కౌన్ బనేగా కరోడ్ పతి.. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పోందిన షోగా పేరొందింది. దానికి హోస్ట్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యవహరిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ వయసులోనూ బిగ్ బి తన చురుకైన మాటలతో కంటెస్టెంట్స్ ను తికమక పెడుతూ ఉంటాడు. తాజాగా KBC సీజన్ 14 దిగ్విజయంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ షో తాజాగా వార్తల్లో నిలిచింది. కోటి రూపాయలు గెలిచి ఉత్సాహాంతో ఉన్న కంటెస్టెంట్ కవితా చావ్లా.. చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయి రూ.7.5 కోట్లను ఆమె చేజార్చుకున్నారు. ఇక ఆ ప్రశ్న క్రికెట్ కు సంబంధించింది కావడం విశేషం. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కవితా చావ్లా.. ఆమె ఓ సెలబ్రిటీ కాదు.. ఓ రాజకీయ నాయకురాలూ కాదు.. కానీ ప్రస్తుతం వార్తల్లో బాగా వినిపిస్తోన్న పేరు. దానికి కారణం ఆమె కౌన్ బనేగా కరోడ్ పతి షో లో పాల్గొనడమే. ఆమె అప్పటికే షోలో రూ. కోటి రూపాయలు గెలుచుకుని చాలా ఉత్సాహంగా మరో రౌండ్ కు చేరుకుంది. ఇక ఈ రౌండ్ లో17వ ప్రశ్న విలువ రూ.7.5 కోట్లు. కవితా రూ. 7.5 కోట్లు గెలుస్తానని ఎంతో ధీమాగా ఉంది. ఈ క్రమంలోనే బిగ్ బి 17వ ప్రశ్నను అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే? ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి మ్యచ్ లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు గుండప్ప విశ్వనాథ్. ఈ ఫీట్ ను ఆయన ఏ జట్టుపై సాధించాడు? a) సర్వీసెస్ b) ఆంధ్రా c) మహారాష్ట్ర d) సౌరాష్ట్ర. కవితా చావ్లా చాలా సేపు ఆలోచింది. కానీ సమాధానాన్ని మాత్రం చెప్పలేక పోయింది. అదీ కాక ఆమె దగ్గర లైఫ్ లైన్స్ కూడా లేవు. దాంతో ఆమె రిస్క్ తీసుకోవడం ఎందుకని గేమ్ నుంచి క్విట్ అవుతున్నట్లు ప్రకటించింది.
అప్పటికే గెలిచిన కోటి రూపాయలతోనే కవిత వెనుదిరిగింది. అయితే 17 ప్రశ్నకు ఆన్సర్ ఆంధ్రా.. ఆంధ్రా జట్టుపై విశ్వనాథ్ ఈ ఘనతను సాధించాడు. ఇతడు 308 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 44 సెంచరీలు, 89 హాఫ్ సెంచరీలతో కలిపి 17,970 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 247 గా నమోదు చేశాడు. ఇక షో విషయానిక వస్తే.. కేబిసీ 14లో రూ. కోటి గెలుచుకున్న తొలి కంటెస్టెంట్ గా కవితా చావ్లా నిలిచారు. ఈమె మహారాష్ట్రలోని కోల్హాపూర్ నుంచి వచ్చారు. కవిత 2000 సంవత్సరం నుంచి ఈ షోలో పాల్గొనాలని ఉన్నట్లు తెలిపింది. ఈ కోటి రూపాయలతో తన కొడుకును విదేశాల్లో చదివిస్తానని ఆమె తెలిపింది. గతంలో కూడా కవిత ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ రౌండ్ వరకు వచ్చింది. కానీ ఆ రౌండ్ దాటి రాలేకపోయింది. ఇదిలా ఉండగా.. ఆమెకు కొద్దిగొప్ప క్రికెట్ నాలెడ్జ్ ఉంటే కచ్చితంగా 7.5 కోట్లు గెలుచుకునేదే అని నెటిజన్స్ అంటున్నారు. మరి ఇంత దూరం వచ్చి కోటి గెలుచుకున్న సాధారణ గృహిణిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#KBC14 Episode 33 written update: First crorepati Kavita Chawla fails to answer Rs 7.5 crore questionhttps://t.co/0qSiFjFLEW
— India Today Showbiz (@Showbiz_IT) September 21, 2022
Exclusive – KBC 14’s first crorepati Kavita Chawla: Last year when I lost the Fastest First Finger round, my son especially got me a TAB to practice typing fast#KaunBanegaCrorepati #kavitachawla #kaunbanegacrorepati14 #kbc14 #AmitabhBachchan https://t.co/6w6tj9VtBA
— ETimes TV (@ETimesTV) September 20, 2022