నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సేవలకు అనుమతిస్తోంది. ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల యాప్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ కూడా ఇప్పటికే.. ఈ సేవలు అందిస్తున్నప్పటికీ యూజర్లను అంతగా ఆకర్షించకలేకపోతోంది. ఈ క్రమంలో పోటీని తట్టుకోవడానికి క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ముందుకొస్తోంది.
కొద్దిరోజుల క్రితం ‘వాట్సాప్ పేమెంట్స్’ ద్వారా నగదు చెల్లింపులు చేసిన వారికి రూ.51 క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై వాట్సాప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఈ ఆఫర్ ను బీటా యూజర్స్ ద్వారా పరీక్షించినట్లు సమాచారం. ఈ క్రమంలో మరో వార్త అందుతోంది. వాట్సాప్ ద్వారా యూపీఐ ట్రాన్సక్షన్స్ చేసిన వారికి ఆ సంస్థ రూ.105 క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తున్నది అని సమాచారం. ముగ్గురు వేర్వేరు కాంటాక్ట్స్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.35 చొప్పున క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది వాట్సప్. ఇలా మూడు సార్లు రూ.35 చొప్పున మొత్తం రూ.105 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అయితే ఒకే యూజర్‌కు మూడు సార్లు డబ్బులు పంపిస్తే ఒకసారి మాత్రమే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వేర్వేరు యూజర్లకు.. వేర్వేరు సందర్భాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. వాట్సప్ పేమెంట్స్ యూజర్ల ట్రాన్సాక్షన్ విజయవంతం అయిన తర్వాత రూ.35 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఈ పీచర్ ఎక్కువ రోజులు అందుబాటులో ఉండకపోవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా ఎక్కువ మంది యూజర్స్ చెల్లింపులు చేసేలా ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్ తీసుకొస్తుందని అంటున్నారు. పేమెంట్ సేవలను ప్రారంభించిన తొలి నాళ్లలో గూగుల్ పే కూడా స్క్రాచ్ కార్డుల రూపంలో క్యాష్బ్యాక్ అందించి పెద్ద సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పేటీఎం, ఫోన్ పే.. సైతం ఇవే మార్గాలను అనుసరించాయి.
వాట్సాప్ పేమెంట్స్ ఎలా చేయాలంటే..
మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్న మొత్తం మీ అకౌంట్ నుంచి డెబిట్ అయి వారి అకౌంట్‌లోకి వెళ్తుంది. మీకు రూ.35 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇలా ముగ్గురికి డబ్బులు పంపి మీరు మొత్తం రూ.105 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🔥🔥Whatsapp UPI Cash back Offer 🔥
👉 Activate UPI on Whatsapp.
👉If image (I) showing while paying to other Whatsapp UPI user, Pay Just ₹1 to get FLAT ₹35 Cash back .
👉3 times (for unique users) per account
👉 User Specific Offer.https://t.co/Mh3By9Lsgr join for More pic.twitter.com/NTvpl0f9GY
— 🅰 🅶 🅿 Deals (@AgpDeals) June 3, 2022
ఇది కూడా చదవండి: WhatsApp: యూజర్లకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్!