అర్జెంటుగా షాపింగ్ చేయాలా..? చేతిలో డబ్బులేదా..? బాధపడకండి.. అలాంటి వారందరికీ ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇలాంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకొని 'బై నౌ పే లేటర్' సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ మరో ముందడుగు వేసింది. ఖర్చు చేసిన డబ్బులను ఒకేసారి చెల్లించలేక ఇబ్బంది పడుతున్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈఎంఐలుగా మార్చుకునే కొత్త వెసులుబాటు కల్పించింది.
నగదు రహిత లావాదేవీల్లో భారతదేశం చాలా పురోగతి సాధించిందనే చెప్పాలి. ఎక్కువగా యూపీఐ యాప్స్ ద్వారానే ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ లావాదేవీల మీద ఛార్జెస్ లేవు. కానీ, పీపీఐ ద్వారా యూపీఐ మర్చంట్స్ చేసే లావాదేవీలపై ఛార్జెస్ పడనున్నాయి.
దేశంలో నగదురహిత లావాదేవీలు భారీగా పెరిగాయ్. చెల్లింపుల విషయంలో ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా చాలానే సంస్థలు ఈ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి.
ఇప్పటివరకు నోట్లను వెదజల్లే ఎటీఎంలను ఎన్నో చూశాం.. ఎటీఎం మెషిన్ లో డెబిట్/క్రెడిట్ పెట్టి పాస్‌వర్డ్ నొక్కగానే.. చకచకా నోట్లు బయటకొస్తుంటాయి. అయితే, ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో రాబోవు రోజుల్లో ఎటీఎంల నుండి నాణేలు గలగలా రాలనున్నాయి. చిల్లర సమస్యలకు చెక్ పెట్టేందుకు.. ఆర్‌బీఐ కాయిన్ వెండింగ్ మెషిన్లను అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత 12 నగరాల్లో ఈ కాయిన్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. నాణేలు కావాలనుకునేవారు […]
దేశంలో యూపీఐ లావాదేవీలు దూసుకెళ్తున్నాయి. టీ, కాఫీలకు చెల్లించే పదీ ఇరవై రూపాయల నుంచి వేల రూపాయల వరకు డిజిటల్ పేమెంట్స్ యాపులనే వాడుతున్నారు. అందులోను సులువుగా చెల్లించుకునే సౌలభ్యం ఉండటంతో ఈ యాప్స్ ప్రజలకు బాగా చేరువయ్యాయి. దీంతో యూపీఐ చెల్లింపుల విలువ కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఈ క్రమంలో ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ‘ఫోన్‌పే’ సరికొత్త ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆధార్‌తో ఈ ప్లాట్‌ఫామ్‌పై యూపీఐ సర్వీస్ పొందొచ్చు. ఇంతకు ముందు […]
కరోనా తర్వాత మనుషుల చేతుల్లో డబ్బు కనిపించడం చాలా వరకు తగ్గిపోయింది. కారణం.. ప్రస్తుతం ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతో పర్స్‌లో డబ్బులు పెట్టుకుని.. దాన్ని మర్చిపోకుండా తీసుకెళ్లే బాధ తప్పింది. బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉండి.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. టీ కొట్టు మొదలు.. ఫైవ్ స్టార్ హోటల్ వరకు ఎక్కడ అయినా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుం ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ […]
టెక్నాలజీ రాకతో గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపాలంటే.. బ్యాంకుకు వెళ్లి.. ఫారమ్ రాసి.. లైన్ లో నిల్చొని.. కౌంటర్ లో తీసుకున్నాక.. పది నుంచి పదిహేను నిమిషాల ప్రాసెస్. కానీ, ఇప్పుడు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవల ద్వారా సెకన్లలోనే డబ్బులు ఇతరులకు ట్రాన్సఫర్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ సౌకర్యంగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు తప్పులు దొర్లి.. తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంటాము. అంతే ఇక […]
క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఈ వార్త తీపికబురు లాంటిది. యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ముందుగా రూపే క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఈ సేవలు అందబాటులోకి రానున్నాయి. ఎన్‌పీసీఐ తాజాగా బ్యాంకులతో సమావేశం అయ్యింది. ఇందులో పలు బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. ఈ సేవలపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. యూపీఐ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి […]
టెక్నాలజీ వినియోగం పెరిగాక ఆన్ లైన్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కి వెళ్లి క్యూ కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు క్షణాల్లో కరెంట్ బిల్ కట్టేయొచ్చు. ఇదొక్కటేకాదు.. మనీ ట్రాన్సఫర్, మొబైల్ రీఛార్జులు, గ్యాస్ బుకింగ్స్, స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, వాటర్ బిల్లులు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో రకాల సేవలు క్షణాల్లో పొందవచ్చు. అయితే, ఈ టెక్నాలజీ మనకే కాదు సైబర్ నేరగాళ్లకు […]
క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు షాపింగ్ కు, ఆన్ లైన్ పేమెంట్స్ కు పరిమితమైన క్రెడిట్ కార్డ్ వాడకాన్ని.. ఇకపై యూపీఐ ట్రాన్సక్షన్స్ కు ఉపయోగించుకునేలా అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు త్వరలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. బుధవారం జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన […]