మీకు వాట్సాప్ లో చాట్ చేసేటపుడు ఎమోజీలను ఉపయోగించే అలవాటుందా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. వాట్సాప్ లో ఆ ఎమోజీని పంపిస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో మానవ జీవన జీవన విధానంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో ప్రతి పని సులువైపోయింది. సమాచారం చేరవేసేందుకు మెసేజింగ్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతుంటారు. వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజెస్, వాయిస్ రికార్డింగ్ మెసేజెసస్, షార్ట్ వీడియో రికార్డింగ్ ద్వారా సమాచారాన్ని పంపిస్తుంటారు. ఇవే కాక వివిద రకాల సింబల్స్ ను ఉపయోగించి కూడా వారు చెప్పాలనుకున్న విషయాన్ని వెల్లడిస్తారు. అయితే హార్ట్ సింబల్ ను ఉపయోగిస్తే రూ. 20 లక్షల జరిమానా విధించనున్నట్లు తెలిపింది ప్రభుత్వం.
వాట్సాప్ లో కోపం, చిరాకు, బాధ, సంతోషం, ప్రేమను ఇంకా ఇతర భావాలను వ్యక్తపరిచేందుకు వివిధ రకాల సింబల్స్ ఉన్నాయి. అయితే ఒకరిపై ఇష్టాన్ని, ప్రేమను తెలిపేందుకు హార్ట్ సింబల్ ను వినియోగిస్తుంటాము. వాట్సాప్ లో ఎరుపు, తెలుపు, నలుపు, పర్పుల్ కలర్, పసుపు, గ్రీన్, బ్లూ రంగుల్లో హార్ట్ ఇమేజ్ లు ఉన్నాయి. వీటిని ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఎరుపు రంగు హార్ట్ ఎమోజీని ప్రేమను తెలిపేందుకు వాడుతుంటారు. కాగా ఇష్టం వచ్చినట్లు హార్ట్ సింబల్స్ పంపిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
వాట్సాప్ లో యువత ఎక్కువగా ప్రేమ విషయంలో హార్ట్ ఎమోజీలను ఉపయోగిస్తుంటారు. అయితే రెడ్ కలర్ హార్ట్ ఎమోజీని పంపే వారికి ప్రభుత్వం షాకిచ్చింది. రెడ్ హార్ట్ ఎమోజీ వేధింపులతో సమానమని సౌదీ అరేబియా నిర్ణయించింది. అవతలి వ్యక్తి ఆమోదం లేకుండా రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే రూ. 20 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి ఇదే నేరం మళ్లీ చేస్తే రూ. 60 లక్షల జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు శిక్ష విధిస్తామని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ అధికారికంగా వెల్లడించాడు.