పెళ్లి గురించి ఈ రోజుల్లో ఎవర్నైనా ఓపినియన్ అడుగుతుంటే ముఖం చిట్లించుకున్నంత పని చేస్తున్నారు. పెళ్లిపై చాలా మందికి నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంది. కొంత మంది పెళ్లి అవసరమంటుంటే.. మరికొంత మంది అవసరం లేదంటూ సలహాలు ఇస్తున్నారు.
పెళ్లి గురించి ఈ రోజుల్లో ఎవర్నైనా ఓపినియన్ అడుగుతుంటే ముఖం చిట్లించుకున్నంత పని చేస్తున్నారు. పెళ్లిపై చాలా మందికి నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంది. కొంత మంది పెళ్లి అవసరమంటుంటే.. మరికొంత మంది అవసరం లేదంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే మెజార్టీ తీర్పు మాత్రం పెళ్లి వద్దని అనుకుంటున్నారు. వివాహం మీద ప్రస్తుత సమాజం ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, పెళ్లి తర్వాత స్నేహితుడో, బంధువుల్లో మనస్పర్థల కారణంగా భార్యా భర్తలు విడిపోవడం లేదా అంతకంటే దారుణ పరిస్థితులు ఎదురు కావడంతో భయపడిపోతున్నారు యువతీయువకులు. ఒక పెళ్లే చేసుకోవడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో ఓ పెద్దాయన ఐదు వివాహాలు చేసుకుని వార్తల్లో నిలిచారు.
అంతేనా తన ఆరోగ్య రహస్యం పెళ్లిళ్లే అంటున్నాడు. ఇంతకు అతని వయస్సు ఎంత అనుకుంటున్నారు..90 ఏళ్లు. అవునండీ ఆ ముసలాయనే ఈ మాట అంటున్నది. సౌదీ అరేబియాకు చెందిన ఈ కుర వృద్ధుడు 90 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లి చేసుకుని..దేశంలోనే అత్యంత పెద్ద వయస్సు వరుడయ్యాడు. ప్రస్తుతం తన ఐదవ భార్యతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. సౌదీలోని ఆఫీఫ్ ప్రాంతానికి చెందిన నాదిర్ బిన్ ద హైమ్ బిన్ వహక్ అల్ ముర్షీదీ అల్ ఓతైబీ ఐదో వివాహం చేసుకున్నాడు. ఆయన పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అందులో అతని బంధువులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ వీడియోలో తాత ఉల్లాసంగా కనిస్తున్నారు. ఈ వీడియోను చూసిన కొంత మంది ముసలోడే కానీ మామూలోడు కాదయ్యో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మనవడు తాతకు అభినందనలు తెలుపుతూ.. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాత మాట్లాడుతూ.. మళ్లీ చేసుకుంటానని అన్నారు. వైవాహిక జీవితం ఎంతో శక్తివంతమైనదని, ప్రశాతంత లభిస్తుందని అంటూన్నారు. అంతేనా తన ఆరోగ్య రహస్యం పెళ్లేనని చెప్పారు. అవివాహితులంతా పెళ్లి చేసుకోవాలని సూచించారు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. తన పిల్లలకు పిల్లులున్నారని, తాను కూడా ఇంకా పిల్లలను కనాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఒక పిల్లే దొరకడం కష్టమౌతున్న ఈ రోజుల్లో ఆయన 5 పెళ్లిళ్లు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
90 برس کی عمر میں پانچویں شادی رچانے والے معمر ترین سعودی دلہا نے کنوارے نوجوانوں کا کیا مشورہ دیے، ویڈیو دیکھیےhttps://t.co/laYvvZpxUy pic.twitter.com/da0hb4WE3w
— العربیہ اردو (@AlArabiya_Ur) July 13, 2023