ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలి స్కూటర్ ను ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఓలా ఎలక్ట్రిక్ కు చెందిన ఓలా ఎస్.1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. బేస్ ఎస్.1 వేరియంట్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవ్వగా టాప్-స్పెక్ ఓలా ఎస్ 1 ప్రో వేరియంట్ ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) చెబుతోంది. రెండు వేరియంట్‌లు పనితీరు, పరిధి, రైడింగ్ మోడ్‌ల సంఖ్య విభిన్నంగా ఉంటాయి. S1 ప్రో వాయిస్ కంట్రోల్, హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి బేస్ S1 వేరియంట్ ఫీచర్లలో ఉన్నాయి. S1 ప్రో అదనపు ఫీచర్లతో అధిక వేగం కలిగి ఉంది.
ఓలా ఎస్ 1 121 కిమీ రేంజ్ మరియు రెండు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. నార్మల్ మరియు స్పోర్ట్స్‌తో 90 కిమీ వేగంతో గరిష్ట వేగాన్ని అందిస్తుంది. టాప్-స్పెక్ ఓలా ఎస్ 1 ప్రో 181 కిమీ రేంజ్‌తో 115 కిలోమీటర్ల వేగంతో, రాబోతోంది. మూడు రైడింగ్ మోడ్‌లు, నార్మల్, స్పోర్ట్స్, హైపర్ మోడ్స్ తో వస్తోంది. తమిళనాడులోని ఫ్యాక్టరీలో ఈ బైక్స్ ను తయారు చేస్తున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ ఆరు నెలల్లోనే స్కూటర్ ను సిద్ధం చేసింది ఓలా కంపెనీ.
ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూటర్ ఉత్పత్తి మొదలైందని సిబ్బంది అంకితభావంతో పనిచేశారని ఓలా సంస్థ వెల్లడించింది. గత నెలలో ప్రీ బుకింగ్ లు ఓపెన్ చేయగా ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసుకున్నారు. రూ.500 చెల్లింపుతో బుకింగ్ కు అవకాశం కల్పించారు.
Reject Petrol! Future is Electric 🙂🇮🇳 pic.twitter.com/3YrP9VHeJC
— Bhavish Aggarwal (@bhash) August 16, 2021