బస్సు చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్‌కు పరుగులు తీస్తోంది. ఎక్కిన ప్రయాణీకులు లగేజీ సర్దుకుంటుండగా.. మరికొంత మంది నిద్రలోకి జారుకుంటున్నారు. అంతలోనే ఏదో అలజడి. ఏమైందో ఏమో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది.
తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్‌కు పరుగులు తీస్తోంది. ఎక్కిన ప్రయాణీకులు లగేజీ సర్దుకుంటుండగా.. మరికొంత మంది నిద్రలోకి జారుకుంటున్నారు. అంతలోనే ఏదో అలజడి. ఏమైందో ఏమో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. వెంటనే ప్రయాణీకులను అలర్ట్ చేశాడు డ్రైవర్. దిగిపోండి అంటూ ఒక్కొక్కరిని బయటకు పంపించేయసాగాడు. దీంతో భయం, భయంగా అరచేతిలో ప్రాణాలు పట్టుకుని హడావుడిగా దిగిపోయారు ప్రయాణీకులు. అంతే వారు చూస్తుండగానే పెద్ద పెద్ద మంటలతో బస్సు మొత్తం దగ్ధమైంది. ప్రాణాలతో భయట పడ్డందుకు ఊపిరి తీసుకున్నారు. ఈ భయానక ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
చెన్నైలోని మాధవరం నుండి నెల్లూరు డిపోకు చెందిన బస్సు జిల్లాలోని ఆత్మకూరుకు 47 మంది ప్రయాణీకులతో బయలు దేరింది. గురువారం రాత్రి 9.30 గంటలకు రెడ్ హిల్స్ సమీపంలోకి బస్సు రాగానే ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు రావడం మొదలయ్యాయి. అంతలోనే మంటలు కూడా రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సు ఆపేసి. ప్రయాణీకులను అలర్ట్ చేశారు. దీంతో తమ లగేజీతో బస్సులో నుండి ఉరుకులు పరుగుల మీద బయటకు వచ్చేశారు. వారు చూస్తుండగానే.. బస్సుకు మంటలు వ్యాపించి పూర్తిగా దహనమైపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. డ్రైవర్ సమయ స్ఫూర్తిగా వ్యవహరించడంతో 47 మంది ప్రాణాలతో బయటపడ్డారు.