ఆడ పిల్ల పుట్టిందనగానే సంబరపడిపోయే తల్లిదండ్రులు.. ఆమెను కంటికి రెప్పలా కాపు కాచి, పెంచి, పెద్ద చేసి, విద్యా బుద్దులు నేర్పుతారు. ఆ తర్వాత ఓ అయ్య చేతిలో పెట్టేందుకు తాపత్రయపడుతుంటారు. పెళ్లి సంబంధాలు చూడటం దగ్గర నుండి ఆమె అత్తారింటి
ఆడ పిల్ల పుట్టిందనగానే సంబరపడిపోయే తల్లిదండ్రులు.. ఆమెను కంటికి రెప్పలా కాపు కాచి, పెంచి, పెద్ద చేసి, విద్యా బుద్దులు నేర్పుతారు. ఆ తర్వాత ఓ అయ్య చేతిలో పెట్టేందుకు తాపత్రయపడుతుంటారు. పెళ్లి సంబంధాలు చూడటం దగ్గర నుండి ఆమె అత్తారింటి అడుగుపెట్టేంత వరకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది తల్లిదండ్రులకు. ఇక అత్తారింట అమ్మాయి సంతోషంగా కాపురం చేస్తుందంటే గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతాడు తండ్రి. కానీ ఇక పెళ్లి చేశాక కూడా అదనపు కట్నం కోసం అల్లుడు, అతడి బంధుగణం హింసలకు గురి చేస్తే తల్లడిల్లిపోతారు తల్లిదండ్రులు. పెళ్లి చేసి పంపించిన కూతురు అదనపు కట్నం కోసం తిరిగి పుట్టింటి పంచన చేరితే.. ఆ బాధ వర్ణనాతీతం.
సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం వరకట్నం తేవాలంటూ ఇంటి కొచ్చిన కోడల్ని హింసలకు గురి చేస్తున్నారు. తాజాగా తమిళనాడు ఎమ్మెల్యే ఇటువంటి ఆరోపణలనే ఎదుర్కొంటున్నారు. తనను అదనపు కట్నం తావాలంటూ భర్త, మామ, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరంటే.. సేలం జిల్లా మేట్టూరు పీఎంకే శాసన సభ్యుడు సదాశివం. సదాశివం కుమారుడు శంకర్‌కు 2019లో సర్కారు కొల్లపట్టికి చెందిన మనోలియాతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 200 సవర్ల బంగారం, రూ. 20 లక్షల కట్నం, రూ. 25 లక్షల విలువ చేసే కారు ఇచ్చినట్లు పేర్కొంది.
వీరికి ఏడాదిన్నర బిడ్డ ఉంది. ఇప్పుడు తన మామ, ఎమ్మెల్యే సదాశివం, అత్త బేబి, భర్త శంకర్, ఆడపడుచు కలైవాణి వరకట్నం కోసం వేధిస్తున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పేర్కొంది. కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో సూరమంగలం మహిళా పోలీసులు మంగళవారం రంగంలోకి దిగారు. అతని కుటుంబంపై వరకట్నం కేసు నమోదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా విచారణకు రావాలని ఎమెల్యేకు మంగళవారం మహిళా పోలీసు స్టేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు.