నథింగ్ ఫోన్ 1 మార్కెట్లోకి రాకముందు వార్తల్లో ఎలా నిలిచేదో.. వచ్చాక కూడా నిరంతరం అలానే నిలుస్తోంది. అప్పుడు యూనిక్ డిజైన్ తో, ఫీచర్ల పరంగా ట్రెండింగ్ లో నిలిస్తే.. ఇప్పుడు లోపాల కారణంగా వార్తలో నిలుస్తోంది. నథింగ్ ఫోన్ లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి యూజర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. స్క్రీన్‌లో ఆకుపచ్చ రంగు లైన్(గ్రీన్ టింట్ టిష్యూ) కనిపిస్తుందని కొందరు, కెమెరాలోకి వాటర్ మాయచ్యుర్ చేరుతుందని మరికొందరు పిర్యాదు చేస్తున్నారు. సమస్యలున్న ఫోన్లను రీప్లేస్ చేస్తున్నామని కంపెనీ చెప్తున్నప్పటికి.. రీప్లేస్‌మెంట్ చేసిన ఫోన్‌లలో కూడా ఇలాంటి సమస్యలే కనిపిస్తున్నాయి.
ట్రాన్సపరెంట్ డిజైన్ తో నథింగ్ ఫోన్ 1.. కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నప్పటికీ.. లోపాల వల్ల చర్చనీయాంశం అవుతోంది. మొదట్లో నథింగ్ ఫోన్ 1ని ప్రాంక్ వీడియో ద్వారా టార్గెట్ చేశారు, ఆ తర్వాత కంపెనీ క్లారీటి ఇస్తూ నోటీసును జారీ చేయాల్సి వచ్చింది. లాంచ్ తర్వాత నథింగ్ ఫోన్ 1 కొనుగోలు చేసిన కస్టమర్లు నిరాశతో అసంతృప్తికి లోనవుతున్నారు. నథింగ్ ఫోన్ 1లో సమస్యలు ఒకదాని తరువాత మరోకటి బయటపడుతూనే ఉన్నాయి.మొదట్లో స్క్రీన్‌పై గ్రీన్ టింట్ గురించి ఫిర్యాదులు వస్తే.. ఇప్పుడు క్వాలిటీపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.
After seeing a branch of photos from customer site .. i specially think that, the most HYPED phone #nothingphone 1 have a big quality control issue.. so for now please Stop buying (for sometime)
Please RT #thetechjourney
Issues
1 Display tint
2 LED strip comes outMore below pic.twitter.com/blHB7sE1lf
— THE TECH JOURNEY (@soudeepghosh) July 28, 2022
రీప్లేస్ మెంట్ రిజెక్ట్:
సోషల్ మీడియా పోస్టుల ప్రకారం.. నథింగ్ ఫోన్ 1లో ఇష్యూస్ ఇండియాలోనే మాత్రమే కాదు, ఇతర దేశాల కస్టమర్లు కూడా పేస్ చేస్తున్నారు. సమస్యలు ఉన్న ఫోన్లను రీప్లేస్ మెంట్ చేస్తున్నామని కంపెనీ చెప్తున్నప్పటికీ.. అందరికి చేయట్లేదన్నది వాదన. రీప్లేస్ మెంట్ కోసం.. రిక్వెస్ట్ పెడుతున్నా.. ఫ్లిప్ కార్ట్ అప్ప్రొవె చేయట్లేదు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేస్తున్నారు.
Bought Phone 1 on first sale and it has lot of issues from over heating to software hangs and also fingerprint scanner issues. I’m using the same with all reported issues as @Flipkart @flipkartsupport is not accepting return nor replacement. pic.twitter.com/OBmMH2E5Ux
— STR (@Thirupatesh) July 25, 2022
డ్యామేజ్ ఫోన్ రీప్లేస్మెంట్:
పాత ఫోన్ లో సమస్యలు వస్తే.. దాన్ని రీప్లేస్ చేసిన ఫోన్ కూడా అదే సమస్యలు ఉంటున్నాయని కస్టమర్లు పేర్కొంటున్నారు. ఈ సమస్యలపై ఇంకా నథింగ్ నుండి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ రీప్లేస్‌మెంట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరిగింది. చాలా మంది స్క్రీన్ పిక్సెల్‌లు డెడ్ అయ్యాయని ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం, కంపెనీ మొదటి OTA అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపింది.
So, my @nothing Phone 1 replacement unit arrived yesterday. Looks like I need to return this too. pic.twitter.com/V3WjSZxjes
— ARpiT (@therational_pi) July 26, 2022
నథింగ్ ఫోన్ 1 ధర:
స్పెసిఫికేషన్స్:
నథింగ్ ఫోన్ 1లో Qualcomm Snapdragon 778G+ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్‌ల రెండు బ్యాక్ కెమెరాలు. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 కెమెరా. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 12 వర్షన్. అంతేకాకుండా ఫోన్ 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ OLED డిస్‌ప్లే, HDR10+ సపోర్ట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్, 12 GB LPDDR5 ర్యామ్‌తో 256 GB వరకు స్టోరేజ్ ఉంది. ఇంకా 4500mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ IP53 రేటింగ్‌ను కూడా పొందింది. నథింగ్ ఫోన్ తో కస్టమర్లు ఎదుర్కుంటున్న సమస్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It’s here 👀
Nothing Phone (1) in all it’s glory ❤️@getpeid @nothing @AkisEvangelidis @robgodwin_ #NothingPhone1 #nothing #nothingphone pic.twitter.com/xuTCVvTMgp
— Rohit Pakalapati (@rohitspeakshere) July 26, 2022
ఇదీ చదవండి: Nothing Phone (1): వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన ‘నథింగ్’ కంపెనీ
ఇదీ చదవండి: Nothing Phone (1): నథింగ్ ఫోన్ 1 పై రూ. 3,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే?