టీమ్ ఇండియా తరువాత కాబోయే హెడ్ కోచ్ ఎవరన్న విషయంలో చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగియనుంది. తరువాత రవిశాస్త్రిని కంటిన్యూ చేయడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు. దీంతో.. శాస్త్రి స్థానంలో రాహుల్ ద్రావిడ్ ని హెడ్ కోచ్ గా చేయాలని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఫిక్స్ అయిపోయాడు.
ఈ నేపథ్యంలోనే శ్రీలంక టూర్ కి వెళ్ళిన యువకులతో కూడిన జట్టుకి ద్రావిడ్ ని ప్రధాన కోచ్ గా నియమించారు. దీంతో.., టీమ్ ఇండియాకి కాబోయే హెడ్ కోచ్ ద్రావిడ్ అని అంతా నిర్ణయించుకున్నారు. కానీ.., ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతను మరెవరో కాదు. ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్. విక్రమ్ ప్రస్తుతం టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఈ కారణంగానే విక్రమ్ రాథోర్ ని హెడ్ కోచ్ చేయడం గ్యారంటీ అన్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో బీసీసీఐ పెద్దలు.. రాథోర్ తో చర్చించినట్లు తెలుస్తోంది.
గంగూలీ ఎంత నచ్చ చెప్పినా రాహుల్ ద్రావిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీని వదిలి రావడానికి ఇష్ట పడలేదు. ఈ నేపథ్యంలో మరో మార్గం లేక గంగూలీ విక్రమ్ రాథోర్ ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. బాగా పేరున్న మాజీ ఆటగాళ్లను కోచ్ లుగా తీసుకొస్తే.., మళ్ళీ ఇగో క్లాషెస్ వచ్చే ప్రమాదం ఉంది. విక్రమ్ చాలా కాలంగా టీమ్ తోనే ఉంటున్నాడు. ఆటగాళ్ల బాలలు, బలహీనతలు అన్నీ విక్రమ్ రాథోర్ కి తెలుసు. పైగా.., కోహ్లీ, రోహిత్, రహానే, ధావన్ వంటి స్టార్ ఆటగాళ్లు అంతా విక్రమ్ తో బాగా కలసి పోతారు. ఇందుకే గంగూలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక విక్రమ్ రాథోర్.. తన మొత్తం కెరీర్ లో మొత్తం 6 టెస్ట్ మ్యాచ్ లు ఆడి..,13 సగటుతో.. మొత్తం 131 పరుగులు చేశాడు. అలానే 7 వన్డే లు ఆడి.., 27 సగటుతో..193 పరుగులు సాధించాడు. కానీ.., ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం విక్రమ్ కి మంచి రికార్డ్ ఉంది. విక్రమ్ రాథోర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 49.66 సగటుతో, 11473 పరుగులు సాధించడం విశేషం. మరి.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.