ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకి బ్యాడ్ టైం నడుస్తుంది. తాజా సమాచార ప్రకారం వైస్ కెప్టెన్ నుంచి హార్దిక్ నుంచి తప్పించనున్నారనే టాక్ వినిపిస్తుంది.
స్టార్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్య టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకానొక దశలో ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోసం తంటాలు పడిన హార్దిక్ ని ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అదృష్టవశాత్తు గుజరాత్ టైటాన్స్ టీంకి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ దశ మారిపోయిందనే చెప్పుకోవాలి. తొలి ప్రయత్నంలోనే తమ జట్టుకి ఐపీఎల్ ట్రోఫీ అందించి ఆదే ఊపులో టీమిండియాలో స్థానం సంపాదించడమే కాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ కి డిప్యూటీ గా ఎంపికయ్యాడు. ఇక అప్పటినుంచి రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ జట్టుని నడిపిస్తున్నాడు. అయితే తాజా సమాచార ప్రకారం హార్దిక్ పాండ్య తన వైస్ కెప్టెన్సీని కోల్పోనున్నాడు.
జట్టని గెలిపించాలంటే ఆకట్టుకునే ఆటతో పాటు అద్భుతమైన కెప్టెన్సీతో మెప్పించగలగాలి. ఆట పరంగా ఈ స్టార్ ఆల్ రౌండర్ పర్వాలేదనిపిస్తున్నా.. కెప్టెన్ గా విమర్శలు తప్పడం లేదు. కెప్టెన్ గా ఫీల్డ్ లో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించడం, సాటి ప్లేయర్లకు గౌరవం ఇవ్వకపోవడం, బ్యాటింగ్ ఆర్డర్ లో ఇష్టమొచ్చినట్లుగా ప్రయోగాలు చేయడం, స్వార్ధం చూపించడం లాంటి అంశాలు హార్దిక్ కి ప్రతి కూలంగా మారాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని హార్దిక్ వైస్ కెప్టెన్సీకి బీసీసీఐ ఎసరు పెట్టేలా కనిపిస్తుంది. వస్తున్న కథనాల ప్రకారం ఆసియా కప్ వరల్డ్ కప్ కి రోహిత్ శర్మ డిప్యూటీగా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బూమ్రాని నియమించాలని భావిస్తుందట. ఇప్పటికే ఈ విషయం కన్ఫర్మ్ అయినట్లు అధికారిక ప్రకటన నేడు రానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడంతో పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో దాదాపు ఏడాది తర్వాత టీంలోకి వచ్చిన బూమ్రా ప్రస్తుతం ఐర్లాండ్ తో జరుగుతున్న సిరీస్ ని సమర్ధవంతంగా నడిపిస్తున్నాడు. తొలి రెండు టీ 20 మ్యాచుల్లో ఈ పేస్ గుర్రం బౌలింగ్ తో పాటు కెప్టెన్సీలోనూ ఆకట్టుకున్నాడు. దీంతో ఆసియా కప్. వరల్డ్ కప్ కి బూమ్రా వైస్ కెప్టెన్ గా దాదాపు ఖరారైనట్టుగానే కనిపిస్తుంది. టీ20ల్లో పాండ్యాను కెప్టెన్‌గా కొనసాగించినా.. వన్డేల్లో మాత్రం వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి, బుమ్రాను వన్డే వైస్ కెప్టెన్‌గా చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి గాయం నుంచి కోలుకొని టీమిండియాలోకి సెలక్ట్ అవ్వడమే కాకుండా పాండ్య నుంచి ఏకంగా వైస్ కెప్టెన్సీ లాక్కున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.