గాయంతో సంవత్సరం పాటు జట్టుకి దూరమైన బూమ్రా.. కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా ప్రాక్టీస్ లో రెచ్చిపోయి బౌలింగ్ చేసాడు.
స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా దాదాపు సంవత్సరం తర్వాత టీమిండియాలోకి అడుగుపెట్టనున్నాడు. గతేడాది ఆసియా కప్ కి ముందు గాయపడిన ఈ స్పీడ్ స్టార్ తిరిగి జట్టులోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. వెన్నుముక సర్జరీ తర్వాత బూమ్రా కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఈ క్రమంలో కొన్ని కీలక సిరీస్ లతో పాటు ఐపీఎల్, ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా బూమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే ఈ ఏడాది ఆసియా కప్, స్వదేశంలో వరల్డ్ కప్ ఉండడంతో బూమ్రా జట్టులోకి అడుగుపెట్టాలని జట్టుతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023కి ముందు ఓ ప్రాక్టీస్ సిరీస్‌గా బుమ్రాకు ఈ ఐర్లాండ్ సిరీస్ ఉపయోగపడనుంది.
గాయంతో సంవత్సరం సంవత్సరం పాటు జట్టుకి దూరమైన బూమ్రా.. కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. పసికూన ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా రేపు శుక్రవారం తొలి టీ 20 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ లో అందరి దృష్టి బూమ్రా మీదే ఉంది. ఎన్నో నెలలుగా దూరంగా ఉంటున్న బూమ్రా ఆసియా కప్, వరల్డ్ కప్ లో టీమిండియాకు ఎంతో కీలకం. దీంతో బూమ్రా తన మునుపటి ఫామ్ ని అందుకుంటాడా? లేదా ? అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. అయితే ఇంకా మ్యాచ్ జరగకముందే బూమ్రా ప్రాక్టీస్ లో చెలరేగి బౌలింగ్ చేసాడు. బౌన్సర్లు, యార్కర్లతో భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నెట్స్ లో ఈ పేస్ గుర్రం బౌలింగ్ ఆడలేక కొంతమంది బ్యాటర్లయితే కిందపడడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రాక్టీస్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.
జట్టులోకి అడుగుపెట్టకముందే తనలో ఇంకా పదును తగ్గలేదని ఈ ఒక్క వీడియో చూస్తే అర్ధం అవుతుంది. దీంతో పసికూన ఐర్లాండ్ కి బూమ్రా చేతిలో చుక్కలు కనపడడం గ్యారంటీ అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా ఒక సంవత్సర కాలంగా బంతి పట్టని బుమ్రా తిరిగి రిథమ్‌ను అందుకోవడంతో బీసీసీఐ సంతోషం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా రేపు 18న శుక్రవారం తొలి టీ20 ప్రారంభం కానుండగా.. 20 న రెండో టీ 20, 23న మూడో టీ 20 జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు డబ్లిన్ వేదికగానే జరగనున్నాయి. మరి బూమ్రా మ్యాచులో కూడా ఇదే ప్రదర్శనతో బ్యాటర్లను ఇబ్బంది పెడతాడో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
The moment we have all been waiting for. @Jaspritbumrah93 like we have always known him. 🔥🔥 #TeamIndia pic.twitter.com/uyIzm2lcI9
— BCCI (@BCCI) August 16, 2023