గత కొన్ని నెలలుగా టీమిండియాకు దూరమైనా రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ రీ ఎంట్రీపై ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారింది.
టీమిండియా వికెట్ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ న్యూఇయర్ వేడుకల డిసెంబర్ 31న ఉత్తరాఖండ్లోని తన ఇంటికి వెళ్తుండగా రూర్కెలా సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పంత్ కారు పూర్తిగా కాలిపోగా, అతడు అద్దాలు పగలకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో అతని నుదుటిపై, వీపుపై, మణికట్టుకు, మోకాలికి గాయాలైన సంగతి తెలిసిందే. మొదట స్థానికంగా ప్రథమ చికిత్స అందించి తర్వాత డెహ్రాడూన్ లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ కు తరలించి.. చికిత్స అందించారు. పంత్ టీమిండియాలో లేకపోయినా ఎప్పటికప్పుడూ తన గాయం గురించి అప్ డేట్ ఇస్తూనే ఉంటాడు. అయితే తాజాగా పంత్ రీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వైరల్ అవుతుంది.
రిషబ్ పంత్ టీమిండియాలో ఎంత ప్రమాదకర బ్యాటర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యర్థి మీద ఎటాక్ చేస్తూ ఆధిపత్యం చూపించడంలో పంత్ ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడైతే పంత్ కి యాక్సిడెంట్ అయిందో అప్పటినుంచి ఈ యువ వికెట్ కీపర్ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు కొన్ని కీలక మ్యాచుల్లో పంత్ ని అభిమానులు ఎంతో మిస్ అయ్యారు. గాయం నుంచి వేగంగా కోలుకున్నప్పటికీ ఫిట్ నెస్ సాధించడంలో సమయం తీసుకుంటున్నాడు. దీంతో ఆసియా కప్ తో పాటుగా వరల్డ్ కప్ లో పంత్ ఆడటం లేదని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు ప్రకారం పంత్ వచ్చే ఏడాది రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.
2024 జనవరి లో 5 టెస్టు మ్యాచుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ భారత్ కి రానుంది. తాజా సమాచార ప్రకారం ఈ సిరీస్ నాటికి పంత్ పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ వార్త విని పండగ చేసుకుంటున్నారు. ఒకవేళ పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే అతడి ప్లేస్ కి వచ్చిన ఢోకా ఏమీ లేదు. పైగా బీసీసీఐ కూడా పంత్‌కు తిరిగి జట్టులో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి. మరి అనుకున్నట్లుగా పంత్ ఇంగ్లాండ్ తో సిరీస్ కి తిరిగి జట్టులో చేరతాడా? లేకపోతే మరింత సమయం తీసుంటాడనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.