లండన్ వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ ఇచ్చిన నిర్దేశించిన 111 పరుగుల విజయలక్ష్యాన్ని.. టీమిండియా ఓపెనర్లే వికెట్ పడకుండా కొట్టేశారు. బుమ్రా(6 వికెట్లు), రోహిత్(58 బంతుల్లో 76*), ధవన్(54 బంతుల్లో 31*) విజృంభించడంతో ఇంగ్లీష్ ప్లేయర్లు విలవిల్లాడిపోయారు. టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లలో మొత్తం నలుగురు డకౌట్లుగా పెవిలియన్ చేరారు.
అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనుకోని ఘటన జరిగింది. ఇండియా ఇన్నింగ్స్ 5వ ఓవర్లో రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ స్టాండ్స్ లో ఉన్న ఓ చిన్నారికి తగిలిన విషయం తెలిసిందే. వెంటనే ఇంగ్లాండ్ ఫిజియోలు ఆ పాపకు మెడికల్ చెకప్ చేశారు. చెకప్ తర్వాత ఆ పాపకు పెద్దగా గాయాలు కాలేదని నిర్ధారించారు. ఆమెకు బాగానే ఉందని నిర్ధారించుకున్న తర్వాత మ్యాచ్ ను కొనసాగించారు.
— Guess Karo (@KuchNahiUkhada) July 12, 2022
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్టాండ్స్ లో ఉన్న ఆ ఆరేళ్ల చిన్నారి మీరా సాల్వీని కలుసుకున్నాడు. ఆమెను కలుసుకుని సారీ చెప్పడమే కాకుండా.. ఆమెకు ఓ టెడ్డీ బేర్ బొమ్మ, చాక్లెట్స్ కూడా ఇచ్చాడు. రోహిత్ శర్మ చేసిన ఆ పనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ చిన్నారితో ఉన్న రోహిత్ శర్మ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్ శర్మ ఆ చిన్నారిని కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Picture of the day! ❤#RohitSharma meets the little girl, who was hit by Rohit’s six earlier. #ENGvIND #INDvENG #INDvsENG pic.twitter.com/KLqYJrIoZZ
— SportsBash (@thesportsbash) July 13, 2022