ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ శ్రీలంక 2022లో భాగంగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది. గల్లేలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక- ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్, 39 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ దినేశ్ చండీమల్ డబుల్ సెంచరీ చేయడం విశేషం. అంతే కాకుండా ఒక్క నిస్సంక మినహా శ్రీలంక టాపార్డర్ బ్యాటర్లు అంతా హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా కొందరు దారుణమైన ట్రోలింగ్ కూడా గురవుతున్నారు. వారిలో ముఖ్యంగా స్టీవ్ స్మిత్ పేరు వినిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులతో మెప్పించిన స్టీవి స్మిత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రమే డకౌట్ గా పెవిలియన్ చేరాడు. రన్స్ చేయకపోవడం పక్కన పెడితే ఎల్బీడబ్ల్యూ రివ్యూకి వెళ్లి నెటిజన్స్ చేతిలో ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇన్నింగ్స్ లో రన్స్ చేయకపోవడం సంగతి పక్కన పెడితే.. 18.5వ ఓవర్లో ప్రబాత్ జైసూర్యా వేసిన బాల్ ప్యాడ్స్ కు తాకింది. శ్రీలంక ఫీల్డర్లంతా అప్పీల్ చేశారు. అంపైర్ కూడా దానిని ఔట్ గా ప్రకటించాడు. వెంటనే స్మిత్ రివ్యూకి వెళ్లాడు. దానిని థర్డ్ అంపైర్ కూడా ఔట్ గా ప్రకటించాడు. ఇప్పుడు స్మిత్ రివ్యూకి వెళ్లడం సోషల్ మీడియాలో చర్చగా మారడమే కాదు.. అతడిని దారుణంగా ట్రోల్ చేసేలా చేసింది. స్మిత్ రివ్యూకి వెళ్లిన బాల్.. వికెట్స్ కి హిట్ అవుతుందని క్లియర్ గా తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆ బాల్ బ్యాట్ కి టచ్ కూడా కాలేదు. సో స్మిత్ నేరుగా పెవిలియన్ కి వెళ్లుంటే ఏ గోలా ఉండేది కాదు. రివ్యూ తీసుకోవడంతో.. “ఇదేనా నీ ఇన్నేళ్ల అనుభవం? అది ఔట్ గ్రహించలేకపోయావా? సిగ్గు చేటు”. క్రికెట్ చరిత్రలో స్మిత్ తీసుకున్నది అత్యంత చెత్త నిర్ణయం. దీనికి అతడిని రెండేళ్లు బ్యాన్ చేయాలి” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. స్మిత్ రివ్యూకి వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Great review Steve Smith! pic.twitter.com/OosfMNpWUX — Crap Cricket (@CrapCric) July 11, 2022 ఇదీ చదవండి: వీడియో: స్టేడియంలో సిక్స్ కొడితే.. రోడ్డు మీద కుర్రాడికి ఎక్కడో తగిలింది! ఇదీ చదవండి: కోహ్లీ, పంత్‌పై గవాస్కర్ ఆగ్రహం.. వారి కాంట్రాక్ట్ డిమోట్ చేయండి!