టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత కొంతకాలంగా టీ 20 లకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మేజర్ టోర్నీలు మినహా టీ 20 ల్లో అసలు కనిపించడం లేదు. గతేడాది టీ 20 ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్ అదే విధంగా వన్డే వరల్డ్ కప్ లో మాత్రమే వీరిద్దరు కనిపించారు. అయితే చాలా కాలం పాటు టీ 20 క్రికెట్ లో స్టార్ ప్లేయర్లుగా ప్రపంచ క్రికెట్ ని శాసించిన వీరిద్దరూ సడన్ గా కనుమరుగవుతూ వస్తున్నారు. కుర్రాళ్ళకి అవకాశం ఇస్తున్నారని కొందరు భావిస్తుంటే.. వన్డే, టెస్టు ల మీద దృష్టి పెట్టేందుకే కోహ్లీ, రోహిత్ టీ 20లకి దూరమయ్యారని మరి కొందరు భావిస్తున్నారు. అంతేకాదు వయసు మీద పడడంతో యంగ్ ప్లేయర్లతో పోటీ పడలేక సెలక్టర్లు పక్కన పెట్టేస్తున్నారని ఇంకొందరి వాదన. ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంపై రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేసాడు.
స్వదేశంలో ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ ముగిసిన మరో 6 నెలలకే అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. ప్రస్తుతం టీ 20 క్రికెట్ కి దూరంగా ఉంటున్న వీరిద్దరూ రానున్న టీ 20 వరల్డ్ కప్ ఆడేది అనుమానంగానే కనిపిస్తుంది. ఈ మేరకు సెలక్టర్లు కూడా ఇప్పటినుంచే హార్దిక్ నేతృత్వంలో కుర్రాళ్లతో కూడిన జట్టుని రెడీ చేస్తుందనే టాక్ కూడా ఉంది. అయితే గందరగోళానికి తెర దించి రోహిత్ శర్మ అసలు విషయం చెప్పేసాడు. “గతేడాది టీ 20 వరల్డ్ కప్ ఉన్నందున వన్డేలు ఆడలేదు. ఈ సారి వన్డే వరల్డ్ ఉన్న కారణంగానే టీ 20 లకి దూరంగా ఉన్నాము. సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ ఉంది. దాంతో, పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాం. అన్ని ఫార్మాట్ లు ఆడితే వరల్డ్ కప్ కి సిద్ధంగా ఉండలేం”. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా నేను, కోహ్లీనే కాదు జడేజా కూడా టీ 20 లు ఆడట్లేదని రోహిత్ శర్మ గుర్తు చేసాడు. ఇక చివరిసారిగా రోహిత్, కోహ్లీ గతేడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో కనిపించారు. ఆ తర్వాత అంతర్జాతీయ టీ 20ల్లో ఇప్పటివరకు వీరు కనిపించలేదు. తాజాగా విండీస్ పర్యటనలో కుర్రలా కోసం తమ స్థానాలను త్యాగం చేసారు. ప్రస్తుతం టీమిండియా విండీస్ తో టీ 20 సిరీస్ ముగించుకొని ఐర్లాండ్ తో 3 టీ 20 ల సిరీస్ ఆడనుంది. వీటి తర్వాత ఆసియా కప్ ఆ వెంటనే వన్డే వరల్డ్ కప్ ఆడనుంది. మొత్తానికి రోహిత్ ఇచ్చిన క్లారిటీ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.