టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా జరిగిన టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ వైట్ వాష్ చేద్దామని ఉర్రూతలూగిన భారత్ జోరుకు మూడో టీ20లో ఇంగ్లాండ్ కళ్లెం వేసింది. ఆఖరి మ్యాచ్ ని గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకుని ఇంగ్లాండ్ జట్టు పరువు కాపాడుకుంది. ఈ మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. రెండు ట20ల్లో కలిపి కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే మరోసారి సోషల్ మీడియాలో కోహ్లీ పేరిట ట్రోలింగ్ నడుస్తుండటం కూడా చూస్తున్నాం. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం కోహ్లీకి ఫామ్ కు సంబంధించిన పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. మీడియా సమావేశంలో రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీని వెనకేసుకొచ్చాడు. కోహ్లీ ఫామ్ కు సంబంధించి రోహిత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Being Virat Kohli is not easy 😕 pic.twitter.com/vGqS8wkpgY
— Cricket_Enthusiast (@Hatedguy123) July 10, 2022
“టీమిండియా గురించి బయటి వారు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు అనే అంశాలను మేం పట్టించుకోం. కొందరు నిపుణుల పేరిట వ్యాఖ్యలు చేస్తుంటారు. అసలు నిపుణులెవరు? వాళ్లని అలా ఎందుకు పిలుస్తారో కూడా నాకు తెలియదు. టీమిండియాలో ఏం జరుగుతోందనేది బయటి వారికి తెలియదు. మేమంతా వరల్డ్ కప్ లక్ష్యంగా కృషి చేస్తున్నాం. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నాం. ఎన్నో చర్చల తర్వాత మాత్రమే జట్టు విషయంలో మార్పులు చేస్తున్నాం”.
Rohit Sharma “We will back Virat Kohli. He has been consistent for a long time. We believe in his quality” pic.twitter.com/7pmunk9QBM
— Subhayan Chakraborty (@CricSubhayan) July 10, 2022
“ప్రతి ఆటగాడు(విరాట్ కోహ్లీ ఫామ్ గురించి) ఒకానొక సమయంలో ఫామ్ కోల్పోతాడు. కెరీర్‌లో ఎంతో అద్భుతంగా రాణించిన ఆటగాడు ఒకటి రెండు సంవత్సరాలు తన ఫామ్ కోల్పోవచ్చు. కానీ ఆటగాడిలో క్వాలిటీ ఎప్పుడూ తగ్గదు. కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడే సమయంలో అందరూ ఈ విషయాన్ని గుర్తుచేసుకోవాలి. నేను కూడా ఒకానొక సమయంలో ఫామ్ లేమితో ఇబ్బంది పడిన వాడినే.”
The way captain Rohit Sharma supported Virat Kohli in Virat’s tough time in yesterday press conference it was amazing. And when Virat Kohli was captain, he also supported Rohit a lot. Showed the bond of Virat Kohli & Rohit Sharma – Brothers, two diamonds of Indian cricket. pic.twitter.com/iyYcU46swQ
— CricketMAN2 (@ImTanujSingh) July 11, 2022
“ఒకటి రెండేళ్ల పాటు రన్స్ చేయకపోతే అలా మాట్లాడకూడదు. ఫ్యాన్స్ ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టచ్చు. జ్టటుని నడుపుతున్న వారికి ఆ ప్లేయర్ క్వాలిటీ ఏంటో, విలువేంటే తెలుసు” అంటూ రోహిత్ కామెంట్ చేశాడు. కోహ్లీ ఫామ్ పై విమర్శలు చేస్తున్న వారికి రోహిత్ సరిగ్గా బుద్ధి చెప్పాడంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. రోహిత్ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma opens up about Virat Kohli’s continuous failure with the bat.@ImRo45 @imVkohli #ViratKohli #RohitSharma𓃵 #ENGvIND
[T60] pic.twitter.com/BkAgcEhsWn
— RevSportz (@RevSportz) July 10, 2022