ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ వివాదాలకు వేదికగా మారింది. ఏకంగా సొంత పార్టీ నేతలనుంచే సీఎం జగన్‌కు తలనొప్పులు మొదలయ్యాయి. పలువురు వైసీపీ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి కేంద్రంగా సత్య సాయి జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో స్వయంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం బాలయ్య ఉద్యమించారు. ఈ ప్రతిపాదనను బాలయ్య వ్యతిరేకించారు. తన నియోజకవర్గం హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరారు.
బాలయ్య రిక్వెస్ట్
హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ నిరసనల్లో పాల్గొని, అటుపై కలెక్టర్ ను కూడా కలిసి సమస్య వివరించారు బాలకృష్ణ. అంతేకాక రెండ్రోజులు పాటు నిరసనలు, మౌన దీక్షలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. దీనిపై గతంలో బాలయ్య స్పందిస్తూ.. ‘అన్ని రంగాల్లో హిందూపురం అభివృద్ధి చెందింది.. జిల్లా కేంద్రానికి అవసరమయ్యే సదుపాయాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. పరిసర ప్రాంతాల వాసులు హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దు. వెంటనే హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలి’ అని ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ.. వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: బాలకృష్ణకి జగన్ అందుకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు: పేర్ని నాని!
పట్టించుకోని జగన్..
బాలయ్య చెప్పిన మాటను ఆయన వీరాభిమాని అయిన జగన్ నెరవేర్చలేదు. ఇక ఆ కలను మరిచిపోవాలని కూడా జగన్ వ్యాఖ్యానించారని సమాచారం. పుట్టపర్తి కేంద్రంగానే సత్య సాయి జిల్లా ఏర్పాటు కానుందని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చే అంశంలో బాలయ్య గట్టిగా ప్రయత్నం చేయలేదని.. అఖండ డైలాగ్‌లు థియేటర్‌లో హిట్ అయ్యాయి కానీ.. వాస్తవంగా కాదని హిందూపురం వాసులు భావిస్తున్నారట. దీనిపై బాలయ్య ఎక్కువ రోజుల పోరాటం చేయలేదని.. అందువల్లే.. జగన్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
పైగా అభిమానం వేరు.. రాజకీయ వేరని జగన్ నిరూపించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ అడుగులు వేశారని అంటున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై హిందూపురం అఖిల పక్ష కమిటీ న్యాయ పోరాటానికి సిద్ధం అయింది. హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలు చేసింది. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఈ అంశంలో కోర్టు తీర్పు కూడా జగన్ కు అనుకూలంగా వస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరి దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో భవిష్యత్తులో తెలియనుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.