జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏపీ సర్కార్ 13 జిల్లాలలను 26 జిల్లాలుగా మార్చింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ప్రభుత్వం పలు అభ్యర్థనల మేరకు కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. […]
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతంలో 13 గా ఉన్న జిల్లాల సంఖ్య ఇప్పుడు 26 కి పెరిగింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలు ఏపీ భౌగోళిక స్వరూపాన్ని మార్చాయి. దీనిపై ప్రస్తుతం రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 9 కోస్తా జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు సముద్రం వచ్చింది అంటున్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే రోజా […]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రంలో జిల్లాలను పెంచిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 13 జిల్లాలు గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 26 జిల్లాలుగా ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రతిపక్షాలు అసహనంతో ఉన్నాయి. ప్రభుత్వం ఇష్టానుసారంగా […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచారు. దీంతో ఇప్పుడు ఏపీ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాలను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లాల పెంపు పరిపాలన సౌలభ్యం కోసం అన్నారు. ఆంధ్రప్రదేశ్ […]
ఏపీలో మరో 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలను తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నూతన జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. బుధవారం వర్చువల్‌గా సమావేశమైన ఏపీ కేబినెట్.. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 26 జిల్లాలతో పాటు 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా […]
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ వివాదాలకు వేదికగా మారింది. ఏకంగా సొంత పార్టీ నేతలనుంచే సీఎం జగన్‌కు తలనొప్పులు మొదలయ్యాయి. పలువురు వైసీపీ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి కేంద్రంగా సత్య సాయి జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ […]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల అశం ఒక కొలిక్కి వచ్చినట్లుగా ఉంది. జిల్లాల పునఃవ్యవస్థీకరణపై వారం రోజుల్లో తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లా కేంద్రాల్లో అధికారుల కార్యాలయాలను కూడా గుర్తించారు. ఉగాది రోజున కొత్తగా ఏర్పాటైన 13 కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాలకు ఒక కలెక్టర్, ఒక జాయిట్ కలెక్టర్, ఒక ఎస్పీని కూడా ప్రభుత్వం నియమించనుంది. ఇదీ చదవండి: చంద్రబాబు ఇలాకలో ఎగిరిన […]
కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ వ్యవహరంలో ప్రజావ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఈ కొత్త జిల్లాల వ్యవహారంతో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీలోని విభేదాలు తెర మీదకు వచ్చాయి. నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సబ్బారాయుడు వర్సెస్ ముదునూరి ప్రసాదరాజు అన్న రేంజ్‌లో రాజకీయం నడుస్తోంది. బుధవారం నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. […]
కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయంపై ప్రజలను సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల స్పందన సంగతి పక్కన పెడితే.. పలువురు సొంత పార్టీ ఎమ్మెల్యేలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆనం రామానారాయణ రెడ్డి.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయగా.. తాజాగా ఈ జాబితాలోకి నగరి […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. విపక్షాలతో పాటు పలువురు సొంత పార్టీ నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేపట్టారంటూ ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. త్వరలోనే ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. మాట్లాడతానని తెలిపారు. మరోవైపు […]