ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచారు. దీంతో ఇప్పుడు ఏపీ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాలను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లాల పెంపు పరిపాలన సౌలభ్యం కోసం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు అయ్యాయి.. అయితే గతంలో ఉన్న కొన్ని జిల్లాలు పేర్లు మార్చలేదు. కొత్తగా ఏర్పడిన జిల్లాల పేర్లు మాత్రం కొన్ని మార్పులు చేర్పులే చేయడం జరిగింది. ప్రభుత్వ భవనాల్లోనే అత్యధిక శాతం కార్యాలయాలు. ఇప్పటికే సరిపడా అధికారుల, ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి.
కొ
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఎంతో సాహసంతో తీసుకున్న నిర్ణయం అని.. ఇది రిత్రలో నవశకానికి నాంది పలకిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దీని వల్ల ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది.. అధికారులు మరింత చేరువలో ఉంటారని పరిపాలన వ్యవస్థ ఎంతో మెరుగు పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.