ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల అశం ఒక కొలిక్కి వచ్చినట్లుగా ఉంది. జిల్లాల పునఃవ్యవస్థీకరణపై వారం రోజుల్లో తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లా కేంద్రాల్లో అధికారుల కార్యాలయాలను కూడా గుర్తించారు. ఉగాది రోజున కొత్తగా ఏర్పాటైన 13 కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాలకు ఒక కలెక్టర్, ఒక జాయిట్ కలెక్టర్, ఒక ఎస్పీని కూడా ప్రభుత్వం నియమించనుంది.
ఇదీ చదవండి: చంద్రబాబు ఇలాకలో ఎగిరిన ఎన్టీఆర్ జెండా.. సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ రచ్చ!
కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. అటు పోలీసు శాఖలోనూ విభజన కసరత్తులు జరుగుతున్నాయి. ఆర్థిక శాఖ ఉద్యోగుల విభజనను పూర్తి చేస్తోంది కూడా. కొత్త జిల్లాలు, వాటి పేర్ల అంశంపై ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ప్రజాప్రతినిధుల నుంచ వచ్చిన వినతులను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వినతుల దృష్ట్యా కొన్ని జిల్లాల పేరు మార్పు, కొన్ని మండలాల జిల్లాల మార్పును కూడా పరిశీలిస్తోంది. చాలా వరకు ప్రజలు కోరుకున్నట్లుగానే విభజన, జిల్లాల ఏర్పాటు ఉండబోతోందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఏప్రిల్ 2న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్
– కొత్త జిల్లాలకు కలెక్టర్, ఒక జేసీ, ఎస్పీ.
– రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగే అవకాశం. – పోలీస్ శాఖలోనూ విభజనకు కసరత్తులుhttps://t.co/O6SRht5eIR— YSR Congress Party (@YSRCParty) March 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.