ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రంలో జిల్లాలను పెంచిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 13 జిల్లాలు గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 26 జిల్లాలుగా ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రతిపక్షాలు అసహనంతో ఉన్నాయి. ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత చంద్రబాబు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం.
సీఎం రాష్ట్రం విషయంలో ప్రజాభిష్టం మేరకు కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అశాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని చంద్రబాబు విమర్శించారు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను సరిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతేకాదు జగన్ పాలనలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రజలపై పన్ను భారం మోపుతున్నారు. దీన్ని బాదుడే బాదుడు పేరుతో ప్రచారం చేస్తామని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయం ఆయన సొంత సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదన్న చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఏపీ అభివృద్ది చేస్తా అని చెబుతున్న సీఎం ఇప్పటి వరకు అమరావతి విషయంలో ఏం అభివృద్ది చేశారు.. కనీసం ఎనభై శాతం కూడా పనులు జరగలేదు. వచ్చే ఐదేళ్లలో ఇంకేం అభివృద్ది చేస్తాడని విమర్శించారు చంద్రబాబు. అంతేకాదు ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.