ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ ఆరంభించిన శ్రీ రాపాక.. ఆర్జీవి డైరెక్షన్ లో నగ్నం మూవీతో ఒక్కసారే పాపులర్ అయ్యింది. ఈ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది.
ఈ మధ్య కొంత మంది సెలబ్రిటీలు పాపులర్ అవ్వడానికి సోషల్ మీడియా ద్వారా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసమయాల్లో కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు.. అయినా కూడా అవేవి లెక్క చేయకుండా తమకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరికొంతమంది సోషల్ మాద్యమాలు వేదికగా చేసుకొని హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు. మరి కొందరు బోల్డ్‌గా మాట్లాడుతూ.. పలు విషయాల్లో బోల్డ్ కామెంట్స్ చేస్తూ వివాదాలు తెరపైకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి కొవలోకే చేరింది రామ్ గోపాల్ వర్మ హీరోయిన్. దేశముదురు, చందమామ, నచ్చావులే వంటి చిత్రాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “నగ్నం” సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది “శ్రీరాపాక”. ఈ అమ్మడు బిగ్ బాస్ లో కూడా మెరిసింది. అయితే తాజాగా ఒ ఇంటర్వ్యూలో భాగంగా బోల్డ్ కామెంట్స్ చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
పెళ్లికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదు ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక అతడు మగాడు కాదని తెలిస్తే జీవితాతం బాధపడేది మనమే అంటూ.. బోల్డ్ కామెంట్స్ చేసింది. అలాగే తన ఫ్రెండ్ కి జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుతూ.. “నా ఫ్రెండ్ ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకుంది. తన ఫస్ట్ నైట్ రోజు భర్త గే అని తెలిసింది. దాంతో ఆమె చాలా బాధపడింది. ఒక డాక్టర్‌కే అలా జరిగిందంటే ఆలోచించండి మరి.! పెళ్లికి ముందే సెక్స్ చేస్తే అతను మగాడ కాదా అని తెలుస్తుంది. నా దృష్టిలో సెక్స్ అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం. అది ఇవ్వలేని వ్యక్తిని పెళ్లి చేసుకోని బాధపడటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం” అంటూ.. బోల్డ్‌గా సమాధానం ఇచ్చింది.
సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకా చాలా మంది ఇలాంటి మాటాలు మాట్లాడతరాని కొందరు నెటిజన్లు అభిప్రాయిపడుతున్నారు. ఇక బోల్డ్ కంటేంట్ ఉన్నా చిత్రాలకు సై అంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలు చేస్తుందో. తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన శ్రీరాపాక.. ఇక్కడ కూడా పలు కాంట్రవర్సీలు సృష్టించింది. మొత్తానికి తక్కువ రోజులు ఉన్నప్పటికీ బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటిని సంపాదించింది. రాపాక డ్రెస్సింగ్ స్టైల్, ఆట తీరుతో ప్రేక్షకులను బాగానే ఆకర్షించినప్పటికీ త్వరగా ఎలిమినేషన్ అయ్యింది. ప్రస్తుతం శ్రీ రాపాక చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.