మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఆయన వేసే సెటైర్లు, పంచులు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో నాగబాబు సోషల్ మీడియాలో తరచుగా ఆస్క్ మీ ఎనిథింగ్ అంటూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు వేసే ప్రశ్నలకు తన స్టైల్లో సమాధానం చెబుతుంటాడు. తమ ప్రత్యర్థులపై కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా నాగబాబు.. మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశాడు. వారు వేసే ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు. కొందరు నెటిజనులు అడిగిన ప్రశ్నలకు మీమ్స్ రూపంలో సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ కన్నా జగన్ రేంజ్ ఎక్కువ అని సెటైర్లు పేల్చారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: హీరోపై లైంగిక ఆరోపణలు.. అవకాశాల పేరుతో వాడుకున్నాడని మహిళ ఫిర్యాదు!
ఇన్‌స్టాగ్రామ్‌లో నాగబాబు నిర్వహించిన ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో ఓ నెటిజన్ ‘పవన్ కళ్యాణ్ కంటే మా జగనన్న రేంజ్ చాలా ఎక్కువ’ అంటూ కాస్త వెటకారంగా మెసేజ్ చేయగా.. అందుకు నాగబాబు కూడా అదే రేంజ్‌లో రిప్లై ఇచ్చారు. ‘తెలుసు బ్రదర్.. మీరంటే ఉన్నోళ్లు బ్రో’ అనే మీమ్‌తో ట్రోల్ చేశారు. వీరి మధ్య వైఎస్ జగన్ కేసులపై చర్చ జరిగింది. ఇక ఓ నెటిజన్ ఏపీలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా అని ప్రశ్నించగా.. ఇప్పుడు చెప్పలేను కానీ.. 2024లో పవన్ కళ్యాణ్ సీఎం కాగానే గ్యారంటీగా వస్తుంది అని సమాధానం ఇచ్చాడు నాగబాబు.
ఇది కూడా చదవండి: మనోజ్ హైయర్ పర్పస్ కామెంట్లపై స్పందించిన నాగబాబు
నాగబాబు ఇన్‌స్టా స్టోరీలో ఉన్న ఈ జస్ట్ ఆస్కింగ్ మీమ్స్ ప్రస్తుతం వైరలవుతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. అనంతరం కొద్ది రోజుల పాటూ పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన ఆయన.. తర్వాత జనసేనకు కాస్త దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. సోదరుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నాగబాబు దూకుడు చూస్తే.. మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. మరి జగన్‌పై నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సీఎం జగన్‌పై నాగబాబు దారుణమైన పోస్ట్! ఆ పదం వాడటంతో!