ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ ప్రముఖ రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ.. వారి నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. అదే సమయంలో వారి పట్ల ప్రజలకు ఉన్న అనుమానాలను సైతం నివృతి చేస్తున్నారు. ఇప్పటికే బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇంటర్వ్యూతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జాఫర్.. తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటర్వ్యూతో మరో సెన్సేషన్ కి తెర లేపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంతో రోజూ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటిస్తూ అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడం, పరిష్కరించేలా చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలా ప్రజల మనసును గెలుచుకున్న నాయకుడిగా కేతిరెడ్డికి విపరీతమైన క్రేజ్ ఉంది.
స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేతిరెడ్డికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తది. పెద్దలంటే గౌరవం, పిల్లలంటే ప్రేమ, అధికారులు సరిగా పని చేయలేదని తెలిస్తే నిలదీసే నైజం అన్నీ కలిగినటువంటి నాయకుడు కేతిరెడ్డి. అలాంటి కేతిరెడ్డితో జాఫర్ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక ఎపిసోడ్ ని రిలీజ్ చేసిన జాఫర్.. తాజాగా రెండవ ఎపిసోడ్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో సెకండ్ ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో పరిటాల శ్రీరామ్, పవన్ కళ్యాణ్, ఆర్జీవీ వంటి వాళ్ళ గురించి మాట్లాడిన కేతిరెడ్డి.. తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తన తండ్రి ఎంతో రక్తపాతాన్ని చూశారని, దానికి బలయ్యారని, ఆ ఫ్యాక్షన్ లో తాను కూడా ఒక బాధితుడ్ని అని అన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత అక్కడితోనే.. తాను గానీ, తన జనరేషన్స్ గానీ, ఇంకోడు గానీ ఫ్యాక్షన్ జోలికి పోకూడదని తన తండ్రి తనకు నేర్పించారని అన్నారు. అలానే ధర్మవరంలో ఫ్యాక్షనిజం ఉందా? లేదా? అనే అంశంపై కూడా ఆయన స్పందించారు. రామ్ గోపాల్ వర్మ చూపించినంత సీరియస్ నెస్ ధర్మవరంలో లేదంటారా అని జాఫర్ అడుగగా.. దానికి కేతిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
‘ఈ రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాలో ఫ్యాక్షనిజాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపించాడు గానీ.. నాకు తెలిసి అలాంటి సంఘటనలు గానీ, సందర్భాలు గానీ లేవు. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆకృత్యాలు చేశారంటే నేను నమ్మను’ అని అన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుల్ ఇంటర్వ్యూ డిసెంబర్ 25 ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. మరి కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.