మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చేసిన పోస్ట్.. ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. నాగబాబు పోస్ట్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి జనాలు మృతి చెందిన ఘటనపై నాగబాబు తనదైన శైలిలో స్పందిస్తూ.. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కి జోహార్ అంటూ పోస్ట్ చేశారు. సాధారణంగా ఎవరైనా మృతి చెందిన సమయంలో జోహార్ అనే పదం వాడుతుంటారు. అలాంటిది నాగబాబు.. సీఎం జగన్‌కి జోహార్ అని పోస్ట్ చేయడంతో వైసీపీ శ్రేణులు నాగబాబుపై విమర్శలు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: జగన్ ప్రభుత్వంపై నాగబాబు సెటైర్లు! సినిమా బ్యాన్ చేయండి: నాగబాబు
జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై నాగబాబు స్పందిస్తూ.. ‘‘జంగారెడ్డి గూడెంలో జరిగిన దుర్ఘటన గురించి తెలుసుకొని తీవ్ర విషాదానికి గురైన నాకు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలు ఎంతో ఊరటని కలుగచేసాయి. మొదటిగా నేను డాక్టర్లు, మీడియా, స్థానికుల అనుకుంటున్నట్లు ఇవి కల్తీ సారా మరణాలుగా పరిగణించినా… మన సీఎం జగన్ తన ప్రత్యేక డిక్షనరీ సహాయంతో వీటిని సహజ మరణాలుగా ధృవీకరించడంతో ఊపిరి పీల్చుకోగలిగాలిగాను’’ అన్నారు.
ఇది కూడా చదవండి: షర్మిళ తొందరపడింది! జగన్ ముందు ఎవ్వరూ నిలబడలేరు: వైఎస్ చెల్లెలు
‘‘అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారైనా.. అందులో మరణించిన వారందరూ కేవలం పురుషులే అయినా… వీరందరూ తమ చూపు కోల్పోయి, కడుపులోని అవయవాలన్ని కాలిపోయి వున్నా… అందరూ ఒకే విధంగా గంటల వ్యవధిలో హఠాన్మరణానికి గురైనా… ఈ చావులకు.. కల్తీ సారాకు ఎటువంటి సంబంధం లేదని, ఇవన్నీ కేవలం సహజ మరణాలుగా నిర్ధారించిన మన ప్రియతమ ముఖ్యమంత్రికి జోహారు. ఇలా ఇంకా ఎంత మంది చనిపోయినా మనం వీటిని కేవలం సహజ మరణాలుగా పరిగణించాల్సిన దుస్థితి రావటం మన ఆంధ్రుల కర్మ. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుంటాబాలను మీరు ఆదుకోవాలి. నష్టపరిహారం చెల్లించాలి’’ అని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు పాలన, జగన్ బిహేవియర్‌పై వైఎస్ విమల సీరియస్ కామెంట్స్
ముఖ్యమంత్రిని ఉద్దేశించి జోహార్ అనే పదం వాడటంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విమర్శ చేస్తే హుందాగా ఉండాలి. జంగారెడ్డిగూడెం దుర్ఘటనకు సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉంటే.. కోర్టును, మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించవచ్చు. కానీ ముఖ్యమంత్రిని ఇలా అనడం దారుణం అంటూ వైసీపీ కార్యకర్తలు నాగబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మెగాబ్రదర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.