సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ, ఆ ప్రేమని పెద్దలు పెళ్లిగా నిశ్చయించడం అందరికీ తెలిసిందే.
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు వరుణ్ తేజ్. ప్రముఖ నటుడు నాగబాబు తనయుడు. మొదటి చిత్రం ‘ముకుంద’ బాగా ఆకట్టున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘కంచె’తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. మెగా బ్యాగ్ గ్రౌండ్ ఎంత ఉన్నా.. తన నటనతో ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు వరుణ్ తేజ్. 2017లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాటి జంటగా ‘మిస్టర్’ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. డేటింగ్ వరకు వెళ్లారు. ఈ విషయాన్ని ఎక్స్ పోజ్ కాకుండా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘అంతరిక్షం’ సమయంలో ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు.
గత నెల 9వ తేదీన ఈ జంట నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ నుండి మాత్రమే కాకుండా ఆ ఫ్యామిలీకి అత్యంత దగ్గర వారైన స్నేహితులు, సన్నిహితులు కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. అయితే.. అప్పటి నుండి వరుణ్-లావణ్య సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ వచ్చారు కానీ.., పెళ్లి డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే.., తాజాగా వీరి పెళ్లి డేట్ ఎప్పుడో బయటకి వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు.. ఆగస్టు 24వ తేదీన లావణ్య-వరుణ్ వివాహం ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇక పెళ్లి చాలా తక్కువ సమయమే ఉండటంతో మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయంలో త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.
మెగా ఫ్యామిలీలో పెళ్లి అంటే ఇండస్ట్రీ నుండి చాలా మంది సెలబ్రెటీలు హాజరు కావాల్సి ఉంటుంది. పైగా.. లావణ్య తరపున కూడా సెలబ్రెటీలు, స్టార్స్ చాలా మంది ఉంటారు. ఇంత స్టార్స్ ను ఇండియాలో అయితే ఒకే వేదికపైన చేర్చి, ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం అసాధ్యం. కాబట్టే.. లావణ్య-వరుణ్ వివాహం ఇటలీలో ఘనంగా జరిపించడానికి పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఇక పెళ్ళికి నెల మాత్రమే సమయం ఉండటంతో.. ఇప్పటికే వరుణ్-లావణ్య పెళ్లి షాపింగ్ చేయడానికి పారిస్ వెళ్లిన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఆరేళ్ల క్రితం వీరిద్దరూ తొలిసారి మిస్టర్ అనే మూవీలో కలిసి నటించారు. అప్పుడే మెగా ప్రిన్స్.. లావణ్య అందానికి ఫిదా అయిపోయాడట. అప్పటి నుండి సాగుతూ వచ్చిన ఈ ప్రేమకథ ఇలా పెళ్లి పీటల వరకు చేరింది అనమాట.