ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఉద్వేగపూరిత ప్రసంగం, చెప్పుతో కొడతా అని ఊగిపోవడం లాంటివి జనసైనికులకు ఉత్సాహాన్ని కలిగించాయి. ఇదంతా జరిగిన కొంతసేపటికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ ని కలిశారు. స్వయంగా వీరిద్దరూ కలిసి మీడియా ముందుకు కూడా వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైపోయినట్లే కనిపిస్తుంది! ఒకవేళ ఇదే జరిగితే.. రాబోయే ఎన్ని కల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
ఇక అసలు విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 175 స్థానాల్లో 102 కైవసం చేసుకుంది. వైసీపీ 67 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 4, ఇతరులు 2 స్థానాలు దక్కించుకున్నారు. ఇక అప్పట్లో తెదేపాకు భాజపా సానుకూల పవనాలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు కలిసొచ్చాయి. ఇక అప్పటి పరిస్థితులతో పోలిస్తే.. 2019కి పూర్తిగా పరిస్థితి మారిపోయింది. మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ.. అధికారాన్ని చేజిక్కుంచుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విజయవంతంగా ప్రజల మద్ధతుతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.
వచ్చే శాసనసభ ఎన్నికలకు మరో రెండేళ్లు ఉంది. అయినా సరే ఏపీలో రోజురోజుకీ రాజకీయ వేడి పెరిగిపోతోంది. వైసీపీ నాయకులు, మంత్రులు పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక చంద్రబాబు వచ్చి పవన్ ని కలిసిన తర్వాత ఆ విమర్శలు దాడి మరింత ఎక్కువైంది. ఇద్దరు బంధంపై వైసీపీ అభిమానులు కార్యకర్తలు, అభిమానులు.. సోషల్ మీడియాలో ఈ ఇద్దరినీ కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ సందేహం అందరి మనసుని తొలిచేస్తోంది. ఎందుకంటే జనసేన-తెదేపా పొత్తు కడితే.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? పవన్ కోసం చంద్రబాబు వెనక్కి తగ్గారా అనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో పవన్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతారా అనిపిస్తోంది. అలానే ఎంతో రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న చంద్రబాబు.. పవన్ ని సీఎంగా అంగీకరిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలపై, నాయకులపై కుట్ర పూరతంగా దాడులు చేస్తున్నప్పుడు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఖండించాలి. pic.twitter.com/dQs5kS88gE
— JanaSena Party (@JanaSenaParty) October 18, 2022