జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేసే వారిపై ఘాటుగా విరుచుకుపడ్డాడు. ఏకంగా చెప్పు తీసుకుని కొడతానంటూ హెచ్చరించాడు. సభాముఖంగా చెప్పు తీసుకుని మరీ ఇలా హెచ్చరికలు జారీ చేశాడు. మంగళగిరిలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంకోసారి నేను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతాను. గత 8 ఏళ్ల కాలంలో ఆరు సినిమాలు చేశాను. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించాను. రూ.33.37 కోట్లు ట్యాక్స్ కట్టాను. నేను కొత్త వాహనం కొంటే మీకెందుకురా’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు పవన్ కళ్యాణ్.
‘‘విడాకులు ఇచ్చి మూడు పెళ్లిల్లు చేసుకున్నాను. దీనిపై మీకేంటి అభ్యంతరం. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెబుతారా.. బూతుల పంచాంగం చెప్పే ప్రతీ వైసీపీ నేతకు ఇదే నా హెచ్చరిక. నించోబెట్టి తోలుతీస్తా.. నా కొడకల్లారా. ఇప్పటి వరకు పవన్‌లోని మంచితనం, సహనం మాత్రమే చూశారు. ఇక మీదట ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు దెబ్బలు తప్పవు’’ అంటూ సభలో చెప్పు చూపించాడు. ఇక యుద్ధం మొదలు.. రాళ్లా.. రాడ్డా దేనితోనైనా యుద్ధానికి సిద్ధం’’ అంటూ పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/lxw8J16YJc
— JanaSena Party (@JanaSenaParty) October 18, 2022