Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడలోని నోవాటెల్‌లో పవన్‌తో భేటీ అయ్యారు. విశాఖలో చోటుచేసుకున్న ఘటనకు సంఘీ భావం తెలపటానికి చంద్రబాబు పవన్‌ను కలిసినట్లు సమాచారం. అంతకు క్రితం పవన్ కల్యాణ్ వైఎస్సార్ సీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతానన్నారు.
పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ @PawanKalyan @ncbn @NagaBabuOffl @mnadendla pic.twitter.com/7h88s53l6Y
— SumanTV (@SumanTvOfficial) October 18, 2022
గత 8 ఏళ్ల కాలంలో ఆరు సినిమాలు చేశానని, రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించానని వెల్లడించారు. రూ.33.37 కోట్లు ట్యాక్స్ కట్టానని స్పష్టం చేశారు. ‘నేను కొత్త వాహనం కొంటే మీకెందుకురా’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు పవన్. మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేసే వారికి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ‘ ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెబుతారా..’ అని మండిపడ్డారు.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై సంఘీ భావం తెలిపేందుకు వచ్చారు.@PawanKalyan @ncbn pic.twitter.com/w6Kx1PBZeT
— SumanTV (@SumanTvOfficial) October 18, 2022