Congress Leader : కేరళ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేత తలకున్నిల్ బషీర్(77) నిన్న( శుక్రవారం) ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా గుండె జబ్బుతో ఆయన బాధపడుతున్నారు. అందుకు ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు. బషీర్ మృతిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రతిపక్ష నాయుకుడు వీడి సతీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హుందా అయిన రాజకీయ నాయకుడ్ని కోల్పోయిందని, ఆయన రాష్ట్రంలోని అందరు కార్యకర్తలకు ఓ రోల్ మోడల్ అని అన్నారు. రాజకీయ నాయకుడిగా కంటే సేవా,సాహిత్య రంగాల్లో ఆయన పేరు మరువలేనిదన్నారు. తిరువనంతపురం రాజకీయాల్లో బషీర్ పేరు చిరస్మరణీయం. 1977లో కలక్కోట్టమ్ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఏకే ఆంటోనీకి అవకాశం కల్పించటానికి తన పదవికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం రాజ్యసభకు ఎన్నికయ్యారు.
1984, 1989లలో చిరయిన్‌కులు నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేపీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ నాయకుడిగానే కాదు రచయితగా కూడా తనని తాను నిరూపించుకున్నారు. పలు ప్రముఖ పత్రికల్లో కాలిమిస్ట్‌గా తన కలాన్ని కదిలించారు. వెలిచ్చమ్ కూడుతల్ వెలిచ్చమ్, రాజీవ్ గాంధీ: సూర్య తేజస్సింటే ఓర్మకు, మండేలయిడే నట్టిల్, గాంధీజీయుడెయుమ్, కే దామోదరన్ ముత్తాల్ బెర్లిన్ కుంజన్‌తాన్ నాయర్ వారె’’ వంటి పుస్తకాలు రాశారు. ప్రముఖ నటుడు ప్రేమ్ నజిర్ చెల్లెలు సుహ్రను ఈయన పెళ్లాడారు.ఇవి కూడా చదవండి : ఏపీ ప్రజలకు గవర్నర్ పిలుపు.. శనివారం రాత్రి గంట పాటు ఇలా చేయండి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.