మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఓటీటీ వెబ్ సిరీస్‌లతో అదరగొడుతుంది. 'లస్ట్ స్టోరీస్ 2' లో చేసిన కొన్ని ఘాటు సన్నివేశాలు నెటిజన్లను విపరితంగా ఆకట్టుకోగా మరి కొందరి నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది.
మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఓటీటీ వెబ్ సిరీస్‌లతో అదరగొడుతుంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ లో చేసిన కొన్ని ఘాటు సన్నివేశాలు నెటిజన్లను విపరితంగా ఆకట్టుకోగా మరి కొందరి నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది. ఎప్పుడూ చేయని విధంగా ఈ సిరీస్‌లో హాట్ సీన్స్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ అవేవి పట్టించుకోలేదు తమన్నా. ఇక.., ఈ మధ్య రిలీజ్ అయిన ‘జైలర్’ సినిమాలోని లిరికల్ సాంగ్ ‘నువ్ కావాలయ్యా’ పాట యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. ఈ పాట ఏకంగా 100 మిలియన్లు సాధించింది. ఇందులో తమన్నా వేసిన ఒక హూక్ స్టెప్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో ఆ స్టెప్‌ను అందరూ రీల్స్ రూపంలో చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిన తమన్నాకి తాజాగా చేదు అనుభవం ఎదురైంది.
సాధారణంగా హీరోయిన్లు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అభిమానులు మీద పడిపోతుంటారు. తాకరాని చోట తాకుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే తమన్నాకు ఎదురైంది. తమన్నా.. కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరవ్వగా అక్కడ తమన్నాను చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు. అక్కడ తనకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె చుట్టూ బౌన్సర్లు ఉండగా.. వారందరినీ తప్పించుకుని మరీ ఓ అభిమాని తమన్నా చేయి పట్టుకున్నాడు. దీంతో అక్కడున్న బౌన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై అతన్ని పక్కకు లాగేశారు. అయితే.. అభిమాని అత్యుత్సాహాన్ని గమనించిన తమన్నా అతనితో సెల్ఫీ దిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో.., తమన్నాది ఎంతో మంచి మనసు అంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇకపోతే తమన్నా వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. జైలర్, బోళా శంకర్ రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఇందులో రజినీకాంత్‌తో చేసిన జైలర్ మూవీ ఆగస్ట్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆ వెంటనే అంటే ఆగస్ట్ 11న చిరంజీవితో నటించిన బోళా శంకర్ రిలీజ్ కానుంది. ఒక్కరోజు వ్యవధిలో రెండు పెద్ద స్టార్స్‌తో చేసిన చిత్రాలు విడుదలకు సిద్దమవడంతో తమన్నా ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధిస్తే.. కెరీర్ పరంగా తమన్నా మరింత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి విజయాలు సాధిస్తాయో.