సినీ పరిశ్రమను వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు గుండెపోటుతో సెలబ్రిటీలు మరణిస్తున్నారు. రెండు రోజుల క్రితం కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు, ప్లేబాక్ సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మృతి చెందిన సంగతి విదితమే.
సినీ పరిశ్రమను వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు గుండెపోటుతో సెలబ్రిటీలు మరణిస్తున్నారు. రెండు రోజుల క్రితం కన్నడ నటుడు, దర్శకుడు, ప్లేబాక్ సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మృతి చెందిన సంగతి విదితమే. బ్యాంకాక్ పర్యటనలో ఉండగా.. ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఇప్పుడు తాజాగా మరో చేదు వార్త వినిపించింది. మాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ సిద్దిఖీ (68) గుండెపోటు బారిన పడిన సంగతి విదితమే. ఈ నెల 7న గుండెపోటు రాగా వెంటనే కొచ్చిలోని ఆసుపత్రికి తరలించారు. కోలుకుంటారు అనుకునే లోపు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
సిద్దిఖీ గుండెపోటుతో మంగళవారం రాత్రి కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో మరణించారు. ఆయన మరణ వార్తతో మలయాళ పరిశ్రమ శోక సంద్రంలో మునిగి పోయింది. మాలీవుడ్ సెలబ్రిటీలంతా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మనకు మాటల మాంత్రికుడు త్రివ్రికమ్ తరహాలో మలయాళంలో ముందు స్క్రిప్ట్, కథలు అందించేవారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఆపై దర్శకుడిగా మారారు. ఆయన మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో దర్శకుడిగా వ్యవహరించారు. తెలుగులో నితిన్ నటించిన మారో చిత్రానికి దర్శకుడు ఆయనే. విజయ్, సూర్యల మూవీ ఫ్రెండ్స్ ద్వారా తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. హిందీలో స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌తో బాడీ గార్డ్ చిత్రాన్ని తెరకెక్కించారు. చివరగా ఆయన 2020లో వచ్చిన మోహన్ లాల్ చిత్రం బిగ్ బ్రదర్‌కు దర్శకత్వం వహించారు. మలయాళంలో మంచి హిట్స్ ఇచ్చి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు.
తెలుగులో చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ గుర్తుంది కదా.. ఆ సినిమా ఒరిజనల్ వర్సన్ దర్శకుడు సిద్దిఖీనే. మలయాళంలో మమ్ముట్టి హీరో. గ్యాంగ్ లీడర్ హిట్ తర్వాత బిగ్ బాస్ రూపంలో బిగ్గెస్ట్ ప్లాప్ వచ్చింది చిరుకి. ఆ తర్వాత రిక్షావోడు రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సమయంలో చిరు మేనియా మెల్లిగా తగ్గడం మొదలు పెట్టింది. అభిమానులు ఆశించిన విధంగా సినిమా తీయాలన్న సంకల్పంతో ఏడాది పాటు ఎటువంటి సినిమా చేయకుండా ఉండిపోయారు చిరంజీవి. ఆ సమయంలో వచ్చిన సినిమానే హిట్లర్. ఒక రకంగా చిరంజీవికి బౌన్స్ బాక్ మూవీ లాంటిది. మలయాళంలో పెద్ద హిట్ కొట్టిన ఈ సినిమాను తెరకెక్కించారు ముత్యాల సుబ్బయ్య. 1997లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అలా చిరంజీవి అభిమానులకు కూడా ఈ డైరెక్టర్ గుర్తిండిపోతాడు. సిద్దిఖీ నిర్మాతగా కూడా మారి రెండు సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన లేరన్న వార్తను టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. సిద్దిఖీ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.